అందరూ అనుకున్నట్లుగానే సరైన సమయానికి వరుడి బంధువులు, వధవు బంధువులు పెళ్లి నిశ్చితార్థం పెట్టుకున్నారు. అంతా రెడీ అయింది. మండపంలోకి ఎక్కడెక్కడి నుంచో ఇద్దరి బంధువులు, కుటుంబ సభ్యులు అందరూ వచ్చారు. ఒక పక్క గుమగుమలాడే వంటకాలతో అంతా సిద్దం చేశారు. మరి కొద్దిసేపట్లో వరుడి వధువు మెడలో తాళి కడతాడని అందరూ అనుకుంటున్నారు. కట్ చేస్తే..పెళ్లి వాయిదా పడింది.
ఇక విషయం ఏంటంటే..? ఉత్తరాఖండ్‌లోని ఖటిమా ప్రాంతంలోని ఇస్లాంనగర్‌కు చెందిన యువతితో ఉత్తరప్రదేశ్‌లోని ఫిలిబిత్ జిల్లా చందోయ్ గ్రామానికి చెందిన ముంతాజ్‌కు వివాహం చేయాలని ఇరు పెద్దలందరూ నిర్ణయం తీసుకున్నారు. అనుకున్నట్లుగానే సరైన సమయానికి ముహుర్తం కూడా పెట్టుకున్నారు. గురువారం పెళ్లి జరగాల్సి ఉంది. ఈ క్రమంలో బాజా బజంత్రీలతో వరుడితో బంధువులంతా వివాహ మండపానికి బయలుదేరారు. ఇక రాష్ట్ర సరిహద్దుల్లో వీరిని వెళ్లకుండా పోలీసులు అడ్డగించారు.
కరోనా రిపోర్టు ఉంటేనే రాష్ట్రంలోకి అనుమతిస్తామంటూ పోలీసులు తెగేసి చెప్పారు. దీంతో ఏం చేయాలో అర్థం కాక పెళ్లికి వెళుతున్న వారంతా కరోనా యాంటిజెన్ పరీక్షలు చేయించుకున్నారు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే..? పరీక్షలు చేయించుకున్నవారిలో ఒక్కరికి కూడా పాటిజివ్ అని తేలలేదు. కానీ పెళ్లి కొడుకుకు మాత్రం కరోనా పాజిటివ్ అని రిపోర్ట్ వచ్చింది. దీంతో బంధువులంతా నమ్మలేక రెండు మూడు సార్లు టెస్ట్ చేయించారు. దీంతో మళ్లీ పాజిటివ్ అనే తేలింది. ఏం చేయలేక వరుడు ఐసోలేషన్‌లోకి వెళ్లి కూర్చున్నాడు. ఇక ఎట్టకేలకు చివరికి పెళ్లి వాయిదా పడింది. ఇక ఈ వార్త ఇరు రాష్ట్రాల్లో వైరల్‌గా మారడంతో తమకు తోచినట్లు కామెంట్లు చేస్తున్నారు.