దేశంలో మహిళా సాధికారతకు, అమ్మాయిల సంరక్షణకు కట్టు బడి ఉంటామని చెబుతున్న బీజేపీ సర్కార్ ఆ దిశ గా ఇవాళ కీలక చర్యలు చేపట్టింది. వచ్చే ఏడాది జరగనున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు.. బీజేపీకి ఎంత కీలకమో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దీన్ని దృష్టిలో ఉంచుకుని.. అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు కోసం ఇప్పటి నుంచే అస్త్రాలు సిద్ధం చేస్తోంది బీజేపీ. ఇప్పటికే యూపీలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించింది. అంతేకాక మహిళా ఓటర్లును ఆకర్షించేందుకు గాను భారీ పథకాన్నే చేపట్టింది బీజేపీ. దానిలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న స్వయం సహాయక బృందాల మహిళల అకౌంట్లలో ఏకంగా 1000 కోట్ల రూపాయలు జమ చేసింది.ప్రస్తుతం ప్రయాగ్రాజ్ పర్యటనలో ఉన్న మోదీ.. స్వయం సహాయక బృందాలకు చెందిన మహిళలను కలిశారు. అనంతరం యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో 1.60 లక్షల మహిళా స్వయం సహాయక బృందాల బ్యాంక్ ఖాతాల్లోకి ఆన్లైన్ ద్వారా 1,000 కోట్లను బదిలీ చేశారు. అంతేకాక 202 టెక్ హోం రేషన్ ప్లాంట్లకు శంఖుస్థాపన చేశారు. ప్రధానమంత్రి కార్యాలయం ప్రకారం, దీనదయాళ్ ఉపాధ్యాయ యోజన – నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ కింద 1000 కోట్ల రూపాయల మొత్తాన్ని స్వయం సహాయక బృందాల ఖాతాలకు బదిలీ చేశారు. దీనిలో 80,000 స్వయం సహాయ బృందాలకు కమ్యూనిటీ పెట్టుబడి నిధి కింద ఒక్కో గ్రూపుకు రూ. 1.10 లక్షలు, మరో 60,000 స్వయం సహాయక బృందాలకు రూ. 15,000 రివాల్వింగ్ ఫండ్ అందజేస్తారు.
మహిళ స్టార్టప్ లను ప్రోత్సాహించడానికి గాను వారికి రూ. 4000 స్టైపండ్ అందజేయనున్నారు. స్టార్టప్ ప్రారంభించిన తర్వాత వరుసగా ఆరు నెలలు ఈ స్టైపండ్ అందించనున్నారు. అదే విధంగా ముఖ్యమంత్రి కన్యా సుమంగళ యోజన పథకంలో భాగంగా లక్ష మంది లబ్దిదారుల ఖాతాల్లో రూ. 20 కోట్లు జమచేయనున్నారు.
Prayagraj: PM transfers Rs 1000 cr in bank accounts of various SHGs, also transfers money to over 1 lakh beneficiaries of Mukhya Mantri Kanya Sumangala Scheme,which provides assistance to girl child. He also laid foundation stone of 202 Supplementary Nutrition Manufacturing Units pic.twitter.com/4r7USB7yjU
— ANI UP/Uttarakhand (@ANINewsUP) December 21, 2021