ఓ పెంపుడు కుక్క తన ప్రాణాలకు తెగించి యజమాని కుటుంబాన్ని కాపాడి, విశ్వాసాన్ని చాటుకుంది. ఇంతకీ ఆ శునకం ఎలా ఆ కుటుంబాన్ని కాపాడిందో ఇప్పుడు తెలుసుకుందాం.
సాధారణంగా కుక్కలకు ఉన్న విశ్వాసం మనుషులకు ఉండదు అని మనం తరచుగా వింటుంటాం. అందుకు తగ్గట్లుగానే పెంపుడు కుక్కలు సైతం తమ యజమాని కుటుంబంపై ఎనలేని విశ్వాసాన్ని చూపిస్తాయి. యజమాని కుటుంబం ఆపదలో ఉంది అంటే చాలు ఈ పెంపుడు కుక్కలు తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ఆ ఫ్యామిలీని కాపాడతాయి. తాజాగా వెలుగు చూసిన వార్తలో.. ఓ పెంపుడు కుక్క తన ప్రాణాలకు తెగించి యజమాని కుటుంబాన్ని కాపాడి, విశ్వాసాన్ని చాటుకుంది. ఇంతకీ ఆ శునకం ఎలా ఆ కుటుంబాన్ని కాపాడిందో ఇప్పుడు తెలుసుకుందాం.
ఒడిశా రాష్ట్రంలోని మల్కన్ గిరి జిల్లా కేంద్రంలోని శిశుమందిర్ సమీపంలో శివ ప్రసాద్ తన కుటుంబంతో జీవిస్తున్నాడు. అతడికి ఓ పెంపుడు కుక్క కూడా ఉంది. ఇక శనివారం రాత్రి కుటుంబ సభ్యులు అంతా నిద్రిస్తుండగా.. ఆ ఇంట్లోకి ఓ విష సర్పం వచ్చింది. దానిని గమనించిన ఆ పెంపుడు కుక్క.. ఒక్క సారిగా ఆ పాముపై దాడి చేసింది. యజమాని ఫ్యామిలీని కాపాడలనే ప్రయత్నంలో తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ఆ పాముతో పోరాడింది. పాము-కుక్క హోరా హోరిగా పోరాడాయి. ఈ పోరాటంలో పామును కొరికి చంపింది కుక్క.
ఈ క్రమంలోనే కుక్క అరుపులకు అక్కడికి వచ్చిన శివ ప్రసాద్ అక్కడి దృశ్యాన్ని చూసి.. స్థానిక స్నేక్ హెల్ప్ లైన్ సిబ్బందికి సమాచారం అందించారు. అయితే వారు వచ్చేసరికే ఆ కుక్క పామును చంపింది. చనిపోయిన ఆ పామును హెల్ప్ లైన్ సిబ్బంది తమతో తీసుకువెళ్లారు. కాగా తన ప్రాణాలకు సైతం తెగించి యజమాని కుటుంబాన్ని కాపాడిన ఆ పెంపుడు శునకంపై స్థానికులు ప్రశంసలు కురిపిస్తున్నారు. కుక్కలపై ప్రేమను చూపిస్తే.. అవి ఎంత విశ్వాసాన్ని చూపిస్తాయో మరోసారి రుజువు చేసింది ఈ పెంపుడు కుక్క.