ఈ మద్య కాలంలో వరుసగా రైలు ప్రమాదాలు సంభవిస్తున్నాయి. గత నెల ఒడిశా బాలాసోర్ జిల్లాలో జరిగిన రైలు ప్రమాద ఘటన మరువక ముందే పలు చోట్లు రైలు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి.
ఇటీవల దేశ వ్యాప్తంగా రైలు ప్రమాదాల సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్నాయి. జూన్ 2 న, బాలాసోర్ లో రెండు ప్యాసింజర్ రైళ్లతో సహా మూడు రైళ్లు ఢీకొని పెద్ర ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 290 మందికి పైగా మరణించగా వెయ్యి మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటన మరువక ముందు మరికొన్ని చోట్లు రైలు ప్రమాదాలు జరిగాయి. తాజాగా బీహార్‌లో మరో రైలు ప్రమాదం చోటు చేసుకుంది. బీహార్ లోని ముజఫర్‌పూర్ రైల్వే స్టేషన్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..
బీహార్ లో రైలు ప్రమాదం జరిగింది. పవన్ ఎక్స్‌ప్రెస్ రైలు బీహార్ లోని ముజఫర్‌పూర్ రైల్వే స్టేషన్ నుండి ముంబైకి బయలుదేరింది. బయలుదేరిన కాసేపటికే.. కోచ్‌లో పెద్ద శబ్దాలు వినిపించాయి. ఈ భయానక సంఘటన ముజఫర్‌పూర్-హాజీపూర్ ట్రైన్ సెక్షన్ భగవాన్‌పూర్ స్టేషన్ వద్ద నిన్న అర్థరాత్రి జరిగింది. శబ్ధం విన్న ప్రయాణికులు ఒక్కసారే భయాందోళనకు గురయ్యారు. వెంటనే అప్రమత్తం అయి చైన్ లాగి రైలును ఆపేశారు. ట్రైన్ లోని డ్రైవర్, గార్డులకు సమాచారం అందించారు. వారు అధికారులకు ఈ విషయం తెలియజేశారు.
హుటాహుటిన రైల్వే అధికారులు అక్కడికి చేరుకొని తనిఖీ చేయగా ఎస్ – 11 కోచ్ చక్రం విరిగిపోయినట్లు గుర్తించారు. వెంటనే రైలు ఇంజనీర్లు, ఉద్యోగులు రైల్వే స్టేషన్ కి చేరుకొని చక్రానికి మరమ్మతులు చేపట్టారు. కాసేపటి తర్వాత రైలు తిరిగి ప్రారంభం అయ్యింది. మొత్తానికి ప్రయాణికులు అప్రమత్తం కావడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని రైల్వే అధికారులు తెలిపారు.