దేశంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఎన్నో మౌళిక సదుపాయాలు కల్పిస్తున్నామని.. కార్పోరేట్ హాస్పిటల్స్ కి ధీటుగా తీర్చి దిద్దామని ప్రభుత్వం చెబుతుంది. కానీ కొన్ని ఆసుపత్రుల్లో సరైన వసతులు లేక.. వైద్య సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా రోగులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు.. వీటికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి.
కొన్ని చోట్ల వైద్య సిబ్బంది నిర్లక్ష్యంతో రోగులు చనిపోయిన ఘటనలు కూడా వెలుగులోకి వచ్చాయి. ఇక మృత దేహాలను తరలించేందుకు అంబులెన్స్ లేకపోవడం, హాస్పిటల్ లో పెషేంట్ ని తీసుకు వెళ్లేందుకు స్ట్రెచర్ లేకపోవడం వల్ల రోగులతో పాటు కుటుంబ సభ్యులు కూడా ఎన్నో కష్టాలు అనుభవిస్తుంటారు. తాజాగా ఓ పేషెంట్ కాలుకి చికిత్స అయ్యింది.. అతడు నడవలేని దీన స్థితిలో ఉన్నాడు.. అతన్ని తీసుకు వచ్చేందుకు ఆసుపత్రిలో స్ట్రెచర్ సౌకర్యం లేకపోవడంతో చేతులపై ఎత్తుకొని తీసుకు వెళ్లారు కుటుంబ సభ్యులు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ లో చోటు చేసుకుది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఓ వ్యక్తికి ఇటీవల కాలికి దెబ్బ తగలడంతో శస్త్ర చికిత్స తీసుకునేందుకు అమెఠీలోని ఓ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లాడు. చికిత్స అనంతరం పేషెంట్ బయటకు వస్తుండగా కాలు జారి కిందపడ్డాడు.. అతన్ని తరలించడానికి కనీసం ఒక్క స్ట్రెచర్ కూడా లేదు. దాంతో చేసేదేమీ లేక కుటుంబ సభ్యులు అతన్ని తమ చేతులపై మోసుకుంటూ బయటకు వచ్చారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
ఉత్తర్ ప్రదేశ్ లో ఆసుపత్రుల్లో మౌళిక సదుపాయాల గురించి డిప్యూటీ సీఎం స్వయంగా పర్యటిస్తున్నా.. కొన్ని చోట్ల ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతూనే ఉన్నాయి. దీనిపై సూపరింటెండెంట్ స్పందిస్తూ.. ఆస్పత్రిలో స్ట్రెచర్ కొరత లేదు.. రోగి బంధువులే అలా తీసుకు వెళ్లడం జరిగిందని.. దానికి ఆసుపత్రి సిబ్బంది ఏంచేస్తారని అన్నారు.