కరెంటు బిల్లు చెల్లించకపోతే చట్టపరంగా చర్యలు తీసుకోవాలి. కానీ ఎవరూ లేని మహిళ అని చూడకుండా.. ఆమె కరెంటు బిల్లు కట్టలేదని ఆమె గౌరవాన్ని నడిరోడ్డు మీద నిలబెట్టేశారు. ఆమె స్నానం చేస్తుండగా ఎలక్ట్రిసిటీ ఉద్యోగులు ఇంట్లో దూరి ఆమె వద్దంటున్నా వినకుండా..
ఒక మహిళ ఇంట్లో స్నానం చేస్తుంది. ఇంట్లో ఎవరూ లేరు. ఎలక్ట్రిసిటీ ఉద్యోగులు ఆమె ఇంట్లో దూరి బిల్లు రికవరీ పేరుతో ఆమె ఇంట్లో సామాన్లు ఎత్తుకెళ్లారు. ఆ విషయం తెలిసిన మహిళ బాత్రూం లోంచి పరిగెత్తుకుంటూ రోడ్డు మీదకు వచ్చింది. చీర కూడా సరిగా కట్టుకోలేదు. అర్ధ నగ్నంగా ఆమె తన ఇంటి సామాన్ల కోసం వెంటపడింది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కరెంట్ బిల్లు కట్టకపోతే ఇలా ఇంట్లో ఎవరూ లేని సమయంలో సామాన్లు ఎత్తుకెళ్తారా అంటూ నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మధ్యప్రదేశ్ లోని సాగర్ లో నివాసం ఉంటున్న ఒక మహిళ కరెంటు బిల్లు కట్టలేదని ఉద్యోగులు ఆమె విషయంలో కనికరం లేకుండా ప్రవర్తించారు.
ఆమె కరెంటు బిల్లు చెల్లించడం లేదని, అది 19 వేల రూపాయలకు చేరడంతో ఆమె కట్టలేకపోయింది. దీంతో ఈస్టర్న్ రీజన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఉద్యోగులు ఆమె ఇంటికి చేరుకొని బైక్, ఇంట్లో ఉన్న బెడ్, ఇతర గృహోపకరణాలను రికవరీ పేరుతో స్వాధీనం చేసుకున్నారు. ఆ సమయంలో వారిని ఆపేందుకు ఇంట్లో ఎవరూ లేకపోవడంతో స్నానం చేస్తున్న వృద్ధురాలు బయటకు వచ్చి ఇంటి సామాన్లను కాపాడుకునే ప్రయత్నం చేసింది. కౌశల్ కిషోర్ వార్డులో ఉన్న మహిళ ఇంటికి చేరుకున్న ఎలక్ట్రిసిటీ కంపెనీ ఉద్యోగులు.. ఆమె కరెంటు బిల్లు చెల్లించడంలో విఫలమైందని ఇలా చేశారు. ఆ సమయంలో ఆమె తప్ప ఇంట్లో ఎవరూ లేరు. ఆమె స్నానం చేస్తున్న సమయంలో ఉద్యోగులు ఇంట్లోకి వచ్చారు. పరుపు, ఇతర ఇంటి సామాన్లు తీసుకెళ్తున్న సమయంలో వృద్ధురాలు బయటకు వచ్చింది.
అర్ధ నగ్నంగా ఉన్న ఆమె అలానే బయటకు వచ్చి ఉద్యోగులను సామాన్లు తీసుకు వెళ్ళొద్దని అభ్యర్థించింది. కానీ వాళ్ళు వినలేదు. దీంతో ఆమె అలానే అర్ధ నగ్నంగా తన సామాన్లు కాపాడుకోవడం కోసం రోడ్డు మీద వాహనం వెనుక పరుగులు పెట్టింది. దీంతో భయపడిన ఉద్యోగులు ఆమె సామాన్లను అక్కడే వదిలేసి వెళ్లిపోయారు. అయితే ఈ ఘటనపై ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అధికారి మన్దీప్ స్పందించారు. విద్యుత్ కనెక్షన్ ఆ మహిళ పేరు మీద లేదని.. అది తన కోడలి పేరు మీద ఉందని.. కొడుకు, కోడలు వదిలేసి వెళ్లిపోయారని ఆమె చెప్పినట్లు అధికారి చెప్పారు. అందుకే మహిళ సామాన్లను అక్కడే తిరిగి ఇచ్చేసినట్లు వెల్లడించారు. అయితే స్టేట్ ఎనర్జీ మినిష్టర్ ప్రధుమన్ సింగ్ తోమర్.. నలుగురు ఉద్యోగులను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు సంబంధిత అధికారులకు నోటీసులు పంపామని అన్నారు. మరి ఈ ఘటనపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.
बिजली बिल वसूली के नाम पर बुजुर्ग महिला की इज्जत को तार तार करते बिजली विभाग के कर्मचारी, शिवराज सिंह जी लाडली बहना योजना से अच्छा है महिलाओं को सम्मान दीजिये ।
प्रदेश की जनता यह सब देख रही है, इसका जवाब आने वाले चुनाव में दिया जाएगा । pic.twitter.com/fcJau1YPja— Arun Subhash Yadav 🇮🇳 (@MPArunYadav) March 26, 2023