పిల్లలకు విద్యాబుద్దలు చెప్పే గురువులు ఈ మద్య అవినీతికి పాల్పపడుతున్న సంఘటనలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి. గౌరవప్రదమైన ఉపాధ్యాయ వృత్తిలో ఉంటూ అక్రమాలకు తెరలేపాడు. ఒడిశాలో రాష్ట్రం రాయగడ జిల్లా కాశీపూర్ లో మద్యతరగతికి చెందిన సాధారణ స్కూల్ టీచర్ ఇంట్లో కోట్లు విలువ చేసే ఆస్తుల భాగోతం బయట పడింది.
ఒడిశా విజిలెన్స్ అధికారులు అతనికి చెందిన ఆస్తులపై ఏకకాలంలో దాడులు నిర్వహించారు. శిశిర్ కుమార్ సెమెలీ సంపాదనకు మించి అక్రమాస్తులు ఉన్నట్టు పక్కా సమాచారం వచ్చిన తర్వాత జైపూర్‌లోని కోరాపుట్‌లోని ఏసీబీ అధికారులు దాడులు చేశారు. ఈ దాడిలో రూ. 4, 16, 99, 477 విలువ చేసే ఆస్తులు బయట పడ్డాయి. రాయగడ జిల్లా కాశీపూర్ బ్లాక్ పరిధిలోని పాఠశాలలో శిశిర్ కుమార్ సెమెలీ ఉపాధ్యాయుడుగా పని చేస్తున్నారు. విజిలెన్స్ అధికారులు ఎనిమిది గంటల విచారణ తర్వాత సెమెలీని అరెస్టు చేసినట్లు తెలుస్తుంది. విచారణలో టీచర్ తన స్థిరాస్తి కంటే 307 శాతం ఎక్కువగా కూడబెట్టినట్లు అవినీతి నిరోధక బృందం గుర్తించింది. అరెస్టు తర్వాత విజిలెన్స్ కోర్టుకు తరలించారు.
ఇది చదవండి : విజయవాడ బాలిక ఆత్మహత్య ఘటనపై రోజా ఫైర్!
స్పెషల్ జడ్జి, విజిలెన్స్, కోరాపుట్ కోర్టు జారీ చేసిన సెర్చ్ వారెంట్ల ఆధారంగా నలుగురు డిఎస్పీలు, ఐదుగురు ఇన్‌స్పెక్టర్లు ఇతర సిబ్బంది నేతృత్వంలోని ఒడిశా విజిలెన్స్ నాలుగు బృందాలు రాయగడ జిల్లాలోని 6 చోట్ల ఏకకాలంలో దాడులు నిర్వహించారు. ఈ సోదాల్లో రూ.2.88 లక్షల నగదు దొరగూడ, రాయగడలో 2 మూడంతస్తుల భవనాలు, 3 రెండంతస్తుల భవనాలు, రూ.22.34 లక్షల బ్యాంకు డిపాజిట్లు, 2 కార్లు (ఇన్నోవా, బొలెరో) కలిగి ఉన్నట్లు తెలిపారు. సోదాల్లో దాదాపు 408 గ్రాములు, 229 గ్రాముల వెండి ఆభరణాలు లభించినట్లు అధికారులు తెలిపారు. దీంతో పాటు రూ.2,83,342కు పైగా బీమా డిపాజిట్లు, స్కూల్ టీచర్‌కు చెందిన ఇతర చర, స్థిరాస్తులను కూడా ఈ దాడిలో స్వాధీనం చేసుకున్నారు.