పిల్లలు రకరకాల మనస్తత్వాలు కలిగి ఉంటారు. అయితే పిల్లల మనస్తత్వాలను ఎరిగి టీచర్లు ప్రవర్తిస్తే పిల్లలు స్కూల్ డుమ్మా కొట్టకుండా చక్కగా వెళతారు. కొంతమంది పిల్లలు స్కూల్ అంటే చాలా సతాయిస్తుంటారు పిల్లలను బడికి పంపేందుకు తల్లిదండ్రులు పడే తంటాలు అంతాఇంతా కాదు. కడుపునొప్పి.. కాలు నొప్పి అని సాకులు చెప్పి బడి బంద్ పెట్టి ఇంటి దగ్గరే ఉంటారు.
నిత్యం పొద్దుటే నిద్రలేచి కొంతమంది పిల్లలు పేరెంట్స్ చెప్పినట్లు బుద్ధిగా తయారై స్కూల్‌కి వెళతారు. మరికొంతమంది పిల్లలు స్కూల్ అంటే చాలా సతాయిస్తుంటారు పిల్లలను బడికి పంపేందుకు తల్లిదండ్రులు పడే తంటాలు అంతాఇంతా కాదు. చివరకు బడి టైం కాగానే కడుపునొప్పి.. కాలు నొప్పి అని సాకులు చెప్పి బడి బంద్ పెట్టి ఇంటి దగ్గరే ఉంటారు. ఇంకొందరు బడి టైంకు బలయలుదేరి బయట తిరిగి స్కూల్ విడిచే సమయంలో ఇంటికి చేరుకుంటారు. తల్లిదండ్రులు బడికి పోయి చదువుకుంటున్నారని అనుకుంటారు. ఇలా పిల్లలు రకరకాల మనస్తత్వాలు కలిగి ఉంటారు. అయితే పిల్లల మనస్తత్వాలను ఎరిగి టీచర్లు ప్రవర్తిస్తే పిల్లలు స్కూల్ డుమ్మా కొట్టకుండా చక్కగా వెళతారు. ఓ టీచర్ పిల్లలతోనే యూనిఫామ్‌లో వచ్చి వారితోనే కలిసి కూర్చొని పిల్లలకు పాఠాలు చెబుతుంది. మరి దీనికి సంబంధించిన పూర్తి వివరాలను మనం తెలుసుకుందాం..
సాధారణంగా టీచర్ అంటే హోం వర్క్ చేయకుంటే కొడుతుంది.. తిడుతుంది అనే భావం కలిగి ఉంటారు. కానీ రాయ్‌పూర్‌లో ఓ టీచర్ వినూత్నంగా విద్యార్థులను ఆకట్టుకుంటోంది. స్కూల్ పిల్లల మాదిరిగా యూనిఫామ్, రెండు జడలు, రిబ్బన్స్ సేమ్ విద్యార్థుల్లో తను కూడా ఒకదాన్నే అనేట్లుగా ప్రవర్తిస్తుంది. ఇలా వారానికి ఒక రోజు ఇలా వస్తుంది. వారితో ఉంటూ వారికి పాఠాలు చెబుతుంది. పిల్లలను చదువులో ప్రోత్సహిస్తూ అందరి ప్రశంసలు అందుకుంటోంది.
ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్ గోకుల్‌రామ్ వర్మ ప్రైమరీ స్కూల్‌లో వారమంతా పిల్లలు ఉత్సాహంగా ఉంటారు. శనివారం మరీ ఉత్సాహంగా ఉంటారు. ఎందుకంటే వారి జాహ్నవి యదు టీచర్ వారిలాగే తయారై వస్తుంది కాబట్టి. ఆ రోజు టీచర్ పిల్లల మధ్యనే కూర్చుని పాఠాలను బోధిస్తుంది. అందుకే పిల్లలకు జాహ్నవి టీచరంటే చాలా ఇష్టం. గోకుల్ రామ్ వర్మ ప్రైమరీ స్కూల్‌లో 1వ తరగతి నుండి 5వ తరగతి వరకు 350 మంది విద్యార్థులు ఉన్నారు. వారు సమీప ప్రాంతాల వారు. పేరెంట్స్ ఎక్కువగా చదువుకోలేదు. క్రమశిక్షణ తెలియదు. ప్రతిరోజు స్కూల్ రావడానికి ఆసక్తి చూపరు. యూనిఫామ్ కూడ వేసుకోకుండా వస్తారు.
అయితే పిల్లల్ని సరైన మార్గంలో స్కూల్‌కు రప్పించేందుకు టీచర్ జాహ్నవి యదు ఓ కొత్త ఆలోచన చేసింది. జాహ్నవి వారానికి ఓ రోజు ప్రతి శనివారం స్కూల్ యూనిఫామ్‌లో రావడం రాయ్‌పూర్‌లో చర్చనీయాంశం అయింది. పిల్లలు స్కూల్‌కు ఇష్టపడి రావాలని.. వారు అయిష్టంతో వస్తే టీచర్లు చెప్పే విషయాలను గాలికి వదిలేస్తారని తెలిపింది. మానసికంగా భయంతో వచ్చి ఇక్కడ వారి ప్రతిభను చూపలేరని వారిని ప్రోత్సహించేందుకే తను ఇలా స్కూల్ యూనిఫామ్ వేసుకుని వారానికి ఒకరోజు వస్తున్నానని చెప్పింది. ఇలా తయారై రావడం పిల్లలో ఆసక్తి నెలకొంది. వారితో కలిసి అన్నీ చేస్తూ పిల్లలతో చదివిస్తుంటే ఏ విషయాన్నిఅయినా తొందరగా గ్రహిస్తారని తెలిపారు. పిల్లలతో బంధం ఏర్పరచుకుని బోధిస్తే కొందరికి ఫేవరేట్ టీచర్లుగా భావిస్తారు. వారు జీవితంలో కూడా గుర్తుండిపోతారు.