ఇటీవల దేశంలో మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోతూ ఉన్నాయి. మహిళలు ఎంత పెద్ద హోదాలో ఉన్నప్పటికీ కొంత మంది వారిని చిన్పచూపు చూడటం.. దుర్భాషలాడటం.. చేయి చేసుకోవడం లాంటి సంఘటనలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి.
దేశంలో మహిళలకు భద్రత కరువైందని ఎన్నో సంఘటనలు సాక్ష్యాలుగా చెబుతున్నాయి. ప్రతిరోజూ మహిళలపై అఘాయిత్యాలు, లైంగిక వేధింపులు పదుల సంఖ్యల్లో జరుగుతున్నాయి. మగవారితో సమానంగా అన్ని రంగాల్లో ఆడవాళ్లు ముందుకు వెళ్తున్నప్పటికీ కొన్ని చోట్ల దారుణమైన అవమానాలు ఎదుర్కొంటున్నారు మహిళలు. మహిళలపై అందులోనూ శాంతి భద్రతలు కాపాడే మహిళా ఇన్స్ పెక్టర్ పై చేయి చేసుకున్నాడు ఓ ప్రజాప్రతినిధి. ఈ ఘటన ఒడిషాలో చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. వివరాల్లోకి వెళితే..
గత నెల ఒడిశా రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి నబ కిషోర్ దాస్ పై ఝుర్పుగూడ జిల్లాలో జరిగిన కాల్పుల్లో కన్నుమూసిన విషయం తెలిసిందే. ఒడిశాలో రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించిపోయాయని రాజకీ నేతలకే భద్రత లేనపుడు ఇక సామాన్యుల పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తూ బీజేపీ కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ సందర్భంగా ప్రతిపక్ష నేతల జయనారాయణ్ మిశ్రా సహ ఇతర బీజేపీ కార్యకర్తలు సంబల్‌పూర్ జిల్లాలో కలెక్టరేట్ కార్యాలయాన్ని ఘెరావ్ చేశారు. ఈ సందర్భంగా పోలీసులు ఆందోళన చేస్తున్నవారిని అడ్డుకున్నారు. ఈ సందర్బంగా మిశ్రా సంబల్ పూర్ జిల్లా ధనుపాలి పోటీస్ స్టేషన్ కి చెందిన మహిళా ఇన్‌స్పెక్టర్ అనితా ప్రధాన్ పై ప్రతిపక్ష నేత మిశ్రా దాడి చేసినట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఒడిశాలో ఒక మంత్రిని పబ్లిక్ గా కాల్చి చంపిన ఘటన పెను సంచలనాకు దారి తీసింది. ఒక మంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తికే భద్రత లేదు.. ఇక సామాన్యుల పరిస్థితి ఏంటని ప్రజలు ఆందోళనకు గురయ్యారు. ఈ నేపథ్యంలోనే కలెక్టర్ ముట్టడికి ప్రయత్నిస్తున్న సమయంలో ప్రతిపక్ష నేత మిశ్రా అక్కడే ఉన్న మహిళా ఇన్‌స్పెక్టర్ అనితా ప్రధాన్ పై ఎమ్మెల్యే మిశ్రా దాడి చేయడంతో కలకలం రేగింది. ఈ విషయం గురించి ఇన్‌స్పెక్టర్ మాట్లాడుతూ.. ‘నేను నా డ్యూటీ చేస్తున్నాను.. మా అధికారుల గురించి ప్రశ్నించి ఎమ్మెల్యేతో మాట్లాడే ప్రయత్నం చేశాను.. కానీ ఆయన నాపై దుర్భాషలాడారు.. అయినా నేను సహనంతో సమాధానం చెబుతుంటే… నన్ను చెప్పుతో కొట్టి నెట్టివేశాడు.. నేను ఒక్కసారే షాక్ తిన్నాను’ అన్నారు అనితా ప్రధాన్. మిశ్రాపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశామన్నారు.
ఇదిలా ఉంటే ఈ వివాదంపై మిశ్రా స్పందిస్తూ.. ‘ఇది కేవలం నన్ను అప్రతిష్టపాలు చేయడానికి చేస్తున్న కుట్ర.. ర్యాలీ సందర్భంగా బీజేపీ మహిళా కార్యకర్తలతో పోలీసులు దురుసుగా ప్రవర్తించారు.. ఈ విషయంపై నేను పోలీసులను ప్రశ్నించడానికి వెళ్తే నన్ను నెట్టివేశారు.. ఆ సమయంలో అక్కడ మహిళా ఇన్‌స్పెక్టర్ ఉండగా ఆమెతో నువు కూడా ఓ మహిళవే కదా.. అని ప్రశ్నించాను? అప్పటికే ఆమెపై పలు అవినీతి ఆరోపణలు ఉన్నాయని.. ప్రతిపక్ష నేతను ఒక మహిళా ఇన్‌స్పెక్టర్ తోసివేయడం ఎంత వరకు న్యాయం? ఈ సంఘటన ఒక్కటి చాటు పోలీస్ వ్యవస్థ ఎంత దారుణంతో ఉంద అని చెప్పడానికి’ అని అన్నారు.