రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భారతదేశపు కేంద్ర బ్యాంక్. అయితే దేశంలో చలామణీలో ఉన్న కరెన్సీని ఆర్బీఐ నియంత్రిస్తుంది. మన కరెన్సీ నోట్లపై స్టార్ గుర్తుంటే ఆ నోట్లు ఇతర నోట్లలాగే చలామణి అవుతాయా.. లేదా.. అనే దానిపై రిజర్వ్ బ్యాంక్ క్లారిటీ ఇచ్చింది.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భారతదేశపు కేంద్ర బ్యాంక్. ఈ బ్యాంక్ అధిపతిని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ అని పిలుస్తారు. దేశం మొత్తంలో ఉన్న బ్యాంకులన్నీ రిజర్వ్ బ్యాంక్ ఆధీనంలో ఉంటాయి. అయితే దేశంలో చలామణీలో ఉన్న కరెన్సీని ఆర్బీఐ నియంత్రిస్తుంది. కొత్తగా కరెన్సీని ముద్రించాలన్నా, ఉన్న కరెన్సీని క్రమబద్దీకరించాలన్నా ఆర్బీఐ ఆధీనంలోనే జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను అమలు పరుస్తుంది. ప్రజలకు నాణ్యమైన కరెన్సీని అందుబాటులో ఉంచడం దీని ముఖ్య ఉద్దేశం. ఈ మధ్యకాలంలో చలామణిలోకి వస్తున్న నోట్లపై స్టార్ గుర్తు ఉంటుంది. అలా ఉన్న కరెన్సీ చెల్లుతుందా? లేదా? ఇవి చట్టబద్దమైనవేనా? అనే సందిగ్ధంలో ప్రజలు ఉంటున్నారు. మరి ఆ ప్రశ్నలన్నింటికి ఆర్బీఐ ఏమని క్లారిటీ ఇచ్చిందో చూద్దాం..
నెంబర్ ప్యానెల్లో స్టార్ గుర్తు ఉన్న కరెన్సీ నోట్లు కూడా ఇతర నోట్లటాగే చెల్లుబాటు అవుతాయని భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేర్కొంది. స్టార్ గుర్తున్న కరెన్సీ నోట్లు కూడా చట్టబద్దమైనవేనని ఆర్బీఐ వెల్లడించింది. నిత్యం మనం చూస్తున్న కరెన్సీ సీరియల్ నెంబర్లతో కూడిన 100 నోట్ల ప్యాక్‌ల్లో జారీ చేస్తుంది ఆర్బీఐ. ప్యానెల్లో ప్రిఫిక్స్‌కు, సీరియల్ నంబర్‌కు మధ్యలో స్టార్ గుర్తును చేరుస్తామని పేర్కొంది. స్టార్ గుర్తు ఉన్న నోట్లు నకిలీ నోట్లుగా సోషల్ మీడియాలో వస్తున్న తప్పుడు ప్రచారానికి ఆర్బీఐ క్లారిటీ ఇచ్చింది.
ఈ మార్చితో ముగిసిన 2022-23 ఆర్థిక సంవత్సరంలో దేశ వ్యాప్తంగా డిజిటల్ చెల్లింపులు వార్షిక ప్రాతిపదికన 13.24 శాతం పెరిగాయని రిజర్వ్ బ్యాంక్ తెలిపింది. ఆర్బీఐ దేశంలో ఆన్లైన్ ఆర్థిక లావాదేవీల స్థాయిని లెక్కించుటకు డిజిటల్ పేమెంట్ ఇండెక్స్‌ను రూపొందించింది. మార్చి నాటికి ఈ సూచి 395.57 కు పెరిగింది. 2022 మార్చి నాటికి 349.30గా ఉంది.https://twitter.com/PIBFactCheck/status/1684150505734569987?s=20