పెళ్లి కాకుండానే తల్లయింది. కానీ సమాజపు హేళన చూపులను భరించలేక..సరిగా కళ్లు కూడా తెరవని పసిబిడ్డను కడతేర్చిందో యువతి. మాతృత్వాన్ని వద్దునుకుని.. కాఠిన్యాన్ని కనబర్చింది. పుట్టి గంటల వ్యవధి కూడా దాటని పసికందును తాను నివాసం ఉంటున్న మూడో అంతస్తు నుండి కిందకు విసిరేసింది. దీంతో బాలుడు అక్కడిక్కడే మృతి చెందాడు. ఈ హృదయ విదారక ఘటన దేశ రాజధాని ఢిల్లీలోని న్యూ అశోక్ నగర్ లో సోమవారం చోటుచేసుకుంది. ఆ మహిళను పోలీసులు ప్రియగా గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
ప్రియ అనే 20 ఏళ్ల యువతి.. తూర్పు ఢిల్లీలోని న్యూ అశోక్ నగర్ లోని జై అంబే అపార్ట్ మెంట్లో తన తల్లిదండ్రులతో కలిసి నివసిస్తోంది. నోయిడాలోని ఓ ప్రైవేటు సంస్థలో పనిచేస్తోంది. ప్రేమ మాయలో పడి.. పెళ్లి కాకుండానే గర్భం దాల్చింది. సోమవారం మగ బిడ్డకు జన్మనిచ్చింది. పుట్టిన కొన్నిగంటల్లోనే ఆ బిడ్డను మూడో అంతస్తులోని బాత్రూమ్ నుండి కిందకు విసిరేసింది. అయితే ఆ అపార్ట్ మెంట్ లో ఉంటున్న వారికి శబ్దం వినపడి.. వెళ్లి చూడగా.. రక్తపు మడుగుల్లో శిశువు కనబడింది. తక్షణమే చిన్నారిని నోయిడా ఆసుప్రతికి తరలించగా.. చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు.
ఈ విషయాన్ని పోలీసులకు తెలియ చేయగా.. వారు వచ్చి అపార్ట్ మెంట్ లో తనిఖీలు చేపట్టారు. యువతి ఫ్లాట్ లో వెతుకుతుండగా.. రక్తపు మరకలు కనిపించాయి. తొలుత బుకాయించిన యువతి.. పోలీసులు తమదైన స్టైల్ లో విచారించగా.. తానే తన కుమారుడ్నిబాత్రూమ్ కిటికీలో నుండి కిందకు పడేసినట్లు అంగీకరించింది. పెళ్లి కాకుండా తల్లినయ్యానని, బంధువులు, సమాజం చేసే హేళనను భరించలేక ఈ పని చేసినట్లు అంగీకరించింది. కాగా, యువతి.. ఆమె తల్లిదండ్రులతో కలిసి ఉండటంతో ఈ ఘటన వెనుక వారి పాత్రపై పోలీసులు విచారణ చేపడుతున్నారు. యువతిపై ఐపిసిలోని పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. వైద్య పరీక్షల నిమిత్తం యువతిని ఆసుప్రతికి తరలించారు.
FEARING SOCIETAL STIGMA: In a tragic incident, a 20-year-old unmarried girl threw her newborn baby boy from the window of her washroom after giving birth due to fear of the society.
The girl was a resident ofJai Ambey Apartments in East Delhi’s Kondli. pic.twitter.com/3EBml5d0W5
— truth. (@thetruthin) January 9, 2023