అసెంబ్లీ ఎన్నికల వేళ అపర్ణ యాదవ్ చర్య ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో పెనుదుమారం రేపుతోంది. అతిపెద్ద రాష్ట్రమైన యూపీలో అతిపెద్ద ప్రాంతీయ పార్టీ అయిన సమాజ్ వాదీ పార్టీ ఈ సారి గట్టిగా కొట్టాలనే ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఇందుకోసం రాజకీయ సమీకరణాలు కూడా భారీగానే చేస్తుంది. ఇదే సమయంలో అసెంబ్లీ ఎన్నికల కు ముందు రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ములాయం సింగ్ యాదవ్ చిన్నకోడలైన అపర్ణ యాదవ్ సరిగ్గా ఎన్నికల వేళ బావ అఖిలేశ్ కు షాకిస్తూ బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ పరిణామం ఎస్పీకి కోలుకోలేని దెబ్బగా అభివర్ణిస్తున్నారు. అసలు ఈ అపర్ణ యాదవ్ ఎవరు.. ఆమె రాజకీయ నేపథ్యం ఏంటీ అన్న విషయం గురించి తెలుసుకుందాం..
సమాజ్ వాదీ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ములాయం సింగ్ యాదవ్ రెండో భార్య సాధనా గుప్తా కొడుకైన ప్రతీక్ యాదవ్‌ను అపర్ణ 2011లో వివాహం చేసుకున్నారు. వీరికి ఓ కుమార్తె ఉంది. ములాయం రాజకీయ వారసత్వానికి అఖిలేశ్ తిరుగులేని నేతయ్యాడు. సవతి తల్లి, సోదరుడితో అఖిలేశ్ కు విభేదాలున్నట్లు అప్పట్లో వార్తలొచ్చినా, ప్రతీక్ భార్య అపర్ణ ఎంట్రీతో ఫ్యామిలీ పాలిటిక్స్ మారిపోయాయని టాక్. అపర్ణ యాదవ్ లఖ్‌నవూలో డిగ్రీ పూర్తి చేశారు.
ఇది చదవండి : ఇదే నా చివరి టోర్నీ! సానియా మీర్జా షాకింగ్ ప్రకటన
రాజకీయాలపై ఆసక్తితో యూకేలోని మాంచెస్టర్ యూనివర్శిటీ నుంచి ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ పాలిటిక్స్‌లో మాస్టర్స్ పూర్తి చేశారు. 2017లోనే అరంగేట్రం చేశారు. ఆ ఏడాది జరిగిన ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ తరఫున లఖ్‌నవూ కంటోన్మెంట్ స్థానం నుంచి పోటీ చేశారు. భాజపా నాయకురాలు రీటా బహుగుణ జోషి చేతిలో 34వేల పైచిలుకు తేడాతో ఓటమి చవిచూశారు. తొలి ఎన్నికల్లోనే ఓటమిపాలైనా.. నిరాశ చెందకుండా రాజకీయ కార్యక్రమాల్లో క్రియాశీలకంగానే ఉంటున్నారు.
ఇది చదవండి : గోనె సంచిలో ప్రముఖ నటి మృతదేహం! షాక్ లో ఇండస్ట్రీ!
అపర్ణ యాదవ్ జంతు ప్రేమికురాలు కూడా. ‘బి అవేర్’ అనే స్వచ్ఛంద సంస్థను నడుపుతున్నారు. జంతు సంరక్షణతో పాటు మహిళల భద్రతపైనా పనిచేస్తున్నారు. ఆమె చేస్తున్న పనులకు గత కొంతకాలంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌పై వివిధ సందర్భాల్లో అపర్ణ ప్రశంసలు కురిపించారు. యోగి ప్రభుత్వం ఆమెకు వై కేటగిరి భద్రత కూడా కల్పించింది. గతంలో అపర్ణ బీజేపీలో చేరుతున్నట్లు వార్తలు వచ్చినప్పటికీ ఈ వార్తలను అఖిలేశ్ గతంలో ఖండించారు. ఇది తమ కుటుంబ వ్యవహారమని చెప్పుకొచ్చారు. కానీ, ఆ ఊహాగానాలను నిజం చేస్తూ అపర్ణ బుధవారం భాజపాలో చేరారు. ఈ సందర్భంగా అపర్ణ యాదవ్ మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోదీ స్ఫూర్తితోనే తాను బీజేపీలో చేరుతున్నట్లు ఆమె పేర్కొన్నారు. నేను ప్రధాని మోదీ నుంచి స్ఫూర్తి పొందుతూ వచ్చాను. అన్నిటికంటే దేశమే నాకు ముఖ్యం.. అందుకే దేశ సేవ కోసం ముందుకొచ్చాను అన్నారు అపర్ణ యాదవ్.