ఈ సృష్టిలో ఎంతో పవిత్రమైనది తల్లి ప్రేమ.. సృష్టిలో ప్రతి ప్రాణికీ మూల కారణం అమ్మ.. పాలు త్రాగించి, ఆహారం తినిపించి, ప్రేమతో పెంచుతుంది. తల్లిని మించిన ప్రేమమూర్తి ఈ ప్రపంచంలోనే ఉండదు అంటారు. అమ్మ కంటే గొప్ప భద్రత , అమ్మ ప్రేమ కంటే గొప్ప ప్రేమ మనకు ఎక్కడ దొరకదు అంటే అతిశయోక్తి లేదు. దేవుడు తాను ఈ భూమిపై కి తనకి బదులుగా అమ్మను పంపాడని అంటారు.
మాతృ ప్రేమ కేవలం మనుషులకే కాదు.. మూగ జంతువులకు కూడా ఉంటుంది. తమ పిల్లలకు ఏ చిన్న ఇబ్బంది వచ్చినా తట్టుకోలేవు. బిడ్డలు కష్టాల్లో ఉన్నా.. ఆపదలో ఉన్నా.. కాపాడేందుకు ప్రాణాలను సైతం పణంగా పెడతాయి. ఇక సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి ఎన్నో వైరల్ వీడియోలు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. కొన్ని వీడియోలు నవ్వులు పూయిస్తుంటే.. కొన్ని వీడియోలు కన్నీరు పెట్టిస్తున్నాయి.
ఓ తల్లి ఏనుగుకి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. ఏనుగు తన బిడ్డను కోల్పోయిన తర్వాత అతి పడే ఆవేదన చూస్తుంటే కళ్లకు నీరు రావడం ఖాయం. పశ్చిమ బెంగాల్‌లోని బనార్హాట్ బ్లాక్‌లోని డోర్స్ ప్రాంతంలో కొన్ని ఏనుగుల గుంపు సంచరిస్తుంది. అలా వస్తున్న ఏనుగుల గుంపు లో ఒక పిల్ల ఏనుగు చనిపోయింది. చనిపోయిన పిల్ల ఏనుగుని తల్లి ఏనుగు దాని దంతాల మద్య పట్టుకొని కొంత దూరం తీసుకు వెళ్లింది. ఆహారం తినకుండా పిల్ల ఏనుగుతో చాలా దూరం ప్రయాణించింది. అలా వెళ్లిన ఆ ఏనుగు రెడ్‌బ్యాంక్ టీ గార్డెన్‌లోని పొద దగ్గరకు వెళ్లి దించింది.
దాని వెంట వచ్చిన మిగతా ఏనుగులు అడవి వైపు వెళ్లగా ఆ తల్లి ఏనుగు మాత్రం తన బిడ్డకోసం బాధపడుతూ అక్కడే ఉండిపోయింది. తన గున్న ఏనుగు పిల్లను తీసుకు వెళ్తున్న ఏనుగును అధికారులు గమనించారు. ఆ తర్వాత కొద్ది దూరం వెళ్లిన ఏనుగు కోసం గాలించగా అక్కడ పిల్ల ఏనుగు కనిపించలేదు.. తల్లి ఏనుగు కనిపించలేదు. ప్రస్తుతం అధికారులు తల్లి ఏనుగును ఎలాగైనా కనిపెట్టి.. అడవుల్లోకి తరలించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
A mother elephant seen carrying carcass of her dead calf in Ambari Tea Estate, Jalpaiguri, West Bengal, India!
🙁🙁pic.twitter.com/9YBachPy8M— Aman Verma (@amanverm_a) May 29, 2022