ఇటీవల కాలంలో మంగళసుత్రం యాడ్ ఎంత తీవ్ర వివాదాస్పదమవుతుందో అందరికీ తెలిసిందే. ప్రజల బనోభావాలు కించపరిచిలేలా ఉన్న ఈ యాడ్ పై నెటిజన్స్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఈ యాడ్ ను వెంటనే తొలగించాలాలని నెటిజన్స్ కోరుతున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే స్పందించారు మధ్యప్రదేశ్ హోం శాఖ మంత్రి నరోత్తమ్ మిశ్రా. ఇలాంటి వివాదాస్పద యాడ్ లు ప్రచారం చేయటం ఏంటని యాడ్ ను రూపొందించిన ప్రముఖ డైజనర్ సబ్యసాచి ముఖర్జీపై మంత్రి విరుచుకుపడ్డారు.
ఇక ఈ యాడ్ ను 24 గంటల్లోగా తొలగించాలని లేకుంటే కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని ఆయన ఫైర్ అయ్యాడు. అయితే ఈ క్రమంలోనే స్పందించింది డిజైనర్ సంస్థ. అయితే వారసత్వం, సంస్కృతిని మరింత డైనమిక్ సంభాషణగా ప్రజల్లోకి తీసుకెళ్దామనుకున్నామని కానీ ఇలాంటి యాడ్ లతో ప్రజల మనోభావాలు దెబ్బతిన్నట్లు మాకు సమాచారం అందిందని, దీనికి మేము చింతిస్తున్నామని సంస్థ ప్రకటించింది. ఇక వెంటనే ఆ యాడ్ ను తొలగించే దిశగా ప్రయత్నాలు చేస్తామంటూ డిజైనర్ సంస్థ వెనక్కితగ్గింది. అయితే గత కొన్ని రోజుల నుంచి ఈ మంగళసూత్రం యాడ్ వివాదాస్పదమవుతున్న విషయం తెలిసిందే.