మద్యం కారణంగా చాలా కుటుంబాలు రోడ్డున పడ్డాయి. అలానే మరెన్నో కుటుంబాలు ఆర్థికంగా చితికిపోయి.. నరకయాతన అనుభవిస్తున్నాయి. కుటుంబం ఎన్నో ఇబ్బందుల్లో ఉన్న మద్యం తాగడం మాత్రం కొందరు మానరు. కుటుంబ సభ్యులు చెప్పే మాటలకు కొందరు కొంతకాలం మానేసి తిరిగి ప్రారంభిస్తారు. ఇలా మంగమ్మ శపథం చేసిన ఎందరో మద్యంలో మునిగి తేలుతున్నారు. వారందరికి ఆదర్శం తమిళనాడుకు చెందిన వ్యక్తి.
మద్యం కారణంగా ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయి. అలానే చాలామంది ఆర్థికంగా చితికిపోయి.. నరకయాతన అనుభవిస్తున్నారు. ఇలా కుటుంబం ఎన్నో ఇబ్బందుల్లో ఉన్న కొందరు మాత్రం మద్యం తాగడం మానరు. భార్య, పిల్లలు చెప్పే మాటలకు కొందరు కొంతకాలం మానేసి తిరిగి ప్రారంభిస్తారు. ఇలా మంగమ్మ శపథం చేసిన ఎందరో మద్యంలో మునిగి తేలుతున్నారు. అయితే ఓ వ్యక్తి మాత్రం మద్యం మానేసి ఏడాది పూర్తి చేసుకుని ఎంతో మందికి ఆదర్శంగా నిలిచాడు. 30 ఏళ్లుగా మద్యం తాగే ఆ వ్యక్తి ఓ ఘటన కారణంగా జీవితాన్నే మార్చేసింది. అంతేకాక తన లాగే మరి కొందరు మద్యం విడనాడాలని అవగాహన కల్పిస్తూ ఆ వ్యక్తి ఊరంతా పోస్టర్లు వేశాడు
తమిళనాడు జిల్లా చెంగల్పట్టు జిల్లా ఆత్తూర్ పంచాయతీ భువనేశ్వరి నగర్‌కు చెందిన మనోహరన్ (53) అనే వ్యక్తి కుటుంబంతో కలిసి జీవనం సాగిస్తున్నాడు. అతడికి భార్య, నలుగురు కుమారులున్నారు. స్థానికంగా టెంకాయలను అమ్ముతూ ఉండేవాడు. అంతేకాక మనోహరన్ కు మద్యం తాగే అలవాటు ఉంది. ఈక్రమంలో కుటుంబాన్ని కూడా సరిగ్గా పట్టించుకునే వాడు కాదు. అలా దాదాపు 30 ఏళ్లుగా మనోహరన్ మద్యం తాగుతూనే ఉన్నాడు. పగలంతా కష్టపడి పనిచేసి.. అక్కడ వచ్చిన డబ్బుతో రాత్రి మద్యం తాగి ఇంటికొచ్చే వాడు.
ఈ క్రమంలోనే భార్య, పిల్లలతో గొడవకు దిగి..వారిని వేధింపులకు గురి చేసేవారు. ఈక్రమంలో తన కళ్లముందే మద్యం తాగి రోడ్డు ప్రమాదంలో దారుణంగా చనిపోయిన వ్యక్తిని స్వయంగా చూశాడు. దీంతో మనోహరన్ మనస్సు చలించింది. అలానే మద్యం కారణంగా అతడి కుటుంబం ఆర్థికంగా నష్టపోయింది. ఇంట్లో కట్టిక పేదరికం ఏర్పడింది. దీంతో రెండు ఘటనలతో మనోహరన్ లో పశ్చాతాపం ఏర్పడింది. ఇక మద్యం మానేస్తానని భార్య పిల్లలకు మాట ఇచ్చాడు.
అలా మనోహరన్ ఏడాది క్రితం మద్యం తాగడం మానేశాడు. మనోహరన్ మందు మానేసి సోమవారం నాటికి ఏడాది పూర్తైంది. ఈ సందర్భంగా తనలాగే మరికొందరు మద్యం మానివేయాలని ఆకాంక్షిస్తూ ఊరంతా పోస్టర్లు అంటించాడు. మద్యం తాగడం వల్ల కలిగే నష్టాలను ఊరంత పోస్టర్ల రూపంలో ప్రచారం చేస్తున్నాడు. మరి.. ఈ మందుబాబు.. మద్యం తాగడం మానేసి.. నలుగురిని మార్చేందుకు తనవంతు కృషి చేస్తున్నాడు. ఈ మారిన మందు బాబును చూసి మిగిలిన వాళ్లు బుద్ధి తెచ్చుకోవాలని నెటిజన్లు అంటున్నారు. మరి.. ఈ వ్యక్తిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.