జీవితంలో మనం అనుకున్నట్లు అన్నీ జరగవు.. కానీ కొన్ని సార్లు మాత్రం యాధృచ్ఛికంగా కోరుకున్నవి ఒకేసారి జరిగిపోతుంటాయి. సాధారణంగా సినిమాల్లో పెళ్లైన జంటకు వెంటనే తాము ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న అవకాశం.. అదృష్టం కలిసి వస్తుంది. కొన్ని సినిమాల్లో పేళ్లి పీటల మీదనుంచి వెళ్లి ఎన్నికల్లో పోటీ చేయడానికి కొత్త జంట నామినేషన్ దఖాలు చేయడం.. పెళ్లి పీఠలపై ఉన్న జంట ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో గెలుపొందడం చూస్తుంటాం. అయితే ఇది సినిమాల్లో కనిపిస్తూ తెగ సంబరపడిపోతుంటారు.. అచ్చం ఇలాంటి ఘటన నిజ జీవితంలో జరిగింది. ఏళ్ల వినోద్ కుమార్ అనే యువకుడికి తన జీవిత లక్ష్యాలు రెండు ఒకే రోజు జరిగాయి.
ఇది చదవండి : తరగతి గదిలో దారుణం..బాలిక కేకలు! వెళ్లి చూస్తే..!
ఒకటి తన జీవిత బాగా స్వామి రాజేశ్వరితో వివాహం జరగడం, రెండు అతను ఎన్నికల్లో నిలబడాలి అనే కోరిక తీరడం. వివరాల్లోకి వెళితే.. 2014 నుంచి బీజేపీలో ముఖ్య కార్యకర్తగా కొనసాగుతూ వస్తున్నాడు. అతని పనితనాన్ని మెచ్చుకొని ఎన్నికల్లో పోటీ చేయడానికి టికెట్ ఇచ్చారు బీజేపీ అగ్రనేతలు. అయితే తాను ఎంతగానో ఇష్పపడే తన జీవిత భాగస్వామి తో తనకు వివాహం నిశ్చయం కావడం, అదే రోజు నామినేషన్ కు చివరి రోజు కావడం విశేషం. చెన్నైలోని తిల్లై గంగా నగర్‌లోని 162వ వార్డులో కౌన్సిలర్‌గా నామినేష వేసిన అనంతరం వినోద్ కూమార్ మట్లాడుతూ.. కార్పొరేషన్ కౌన్సిలర్ పదవికి పోటీ నాకు టికెట్ ఇచ్చారు.. అదే సమయంలో మా పెళ్లి, రిసెప్షన్ వరుసగా 3, 4 వ తేదీలలో జరగాల్సి ఉంది.
Aftr tying the knot this mrng in #tiruvallur , newlyweds Vinoth Kumar – Rajeswari skipped celeb & rushed to #Chennai to file the former’s @BJP4TamilNadu
nomination fr Urban local body #pollsWedding coincided wit last day to file papers.. so they did both#India #TamilNadu pic.twitter.com/tOaIpYochy
— Sidharth.M.P (@sdhrthmp) February 4, 2022
నేను ముందుగా నామినేషన్ వేయాలని చూసినా.. కొన్ని పనుల వల్ల అది కుదరలేదు. ఇక చెన్నైకి ఆనుకుని ఉన్న తిరువళ్లూరులో పెళ్లి చేసుకున్న తర్వాత, కొత్త జంట చెన్నైకి పరుగులు పెట్టాల్సి వచ్చిందని.. ఫోటో సెషన్‌లు, వివాహ వేడుకలను వదిలేసి జోనల్ ఆఫీస్ కి పరిగెత్తామని.. పెళ్లి అయిన వెంటనే నామినేషన్ దాఖలు చేయడానికి తన భార్యతో కలిసి వచ్చి నామినేషన్ దాఖలు చేశానని వినోద్ కుమార్ అన్నాడు. మొత్తానికి దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
A full-time #BJP worker since 2014, Feb4th also happens to be the day he joined the party..
He says there was a delay in paperwork, hence had to file nomination on last day, which also happened to be the fixed date for his wedding
Wife & family fully supportive, he adds pic.twitter.com/usTvYL8oMO
— Sidharth.M.P (@sdhrthmp) February 4, 2022