LTTE చీఫ్ ప్రభాకరన్.. తమిళుల ఆరాధ్య దైవంగా పూజలు అందుకున్న ఏర్పాటువాద నాయకుడు. తమిళ మైనార్టీల కోసం వేర్పాటువాద ఉద్యమాన్ని ప్రారంభించి, ప్రభుత్వంపై పోరాటం చేశాడు.
LTTE ప్రభాకరన్.. తమిళ ప్రజల అభ్యున్నతి కోసం, తమిళ ప్రజల కోసం పోరాడిన వ్యక్తిగా మనందరికి సుపరిచితమే. తమిళులు ప్రభాకరన్ ను ఓ దైవంలా చూస్తారు. తమిళుల హక్కుల కోసం ప్రభాకరన్ ప్రభుత్వంపై ఓ యుద్ధాన్నే ప్రకటించాడు. అయితే పోలీసుల ఆపరేషన్ లో అతడు మరణించి సంవత్సరాలు గడుస్తోంది. ఈ క్రమంలో తమిళనాడుకు చెందిన ఓ రాజకీయ నేత చేసిన ప్రకటన ప్రస్తుతం సంచలనంగా మారింది. LTTE చీఫ్ వేలుపిళ్లై ప్రభాకరన్ బతికే ఉన్నాడని కాంగ్రెస్ మాజీ నేత పళనెడుమారన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు.
LTTE ప్రభాకరన్.. తమిళుల ఆరాధ్య దైవంగా పూజలు అందుకున్న ఏర్పాటువాద నాయకుడు. తమిళ మైనార్టీల కోసం వేర్పాటువాద ఉద్యమాన్ని ప్రారంభించాడు ప్రభాకరన్ దాంతో ప్రభుత్వం అతడిని హిట్ లిస్ట్ లోకి చేర్చింది. ఇక 2009 మే 18న ముల్లైవైతూ జిల్లా ముల్లైక్కల్ వద్ద శ్రీలంక బలగాల చేతుల్లో ప్రభాకరన్ మరణించినట్లు అప్పట్లో ప్రకటన కూడా వెలువడింది. అయితే ప్రభాకరన్ బతికే ఉన్నాడని, అతడు పోరాడాల్సిన సమయం వచ్చిందని సంచలన వ్యాఖ్యలు చేశాడు తమిళ జాతీయవాది, కాంగ్రెస్ మాజీ నేత, తమిళర్ పెరమైప్పూ నేత పళ నెడుమారన్.
తమిళ ప్రజల కోసం లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ ఇలం(LTTE) చీఫ్ ప్రభాకరన్ త్వరలోనే వస్తాడని నెడుమారన్ అన్నాడు. ప్రస్తుతం శ్రీలంకలో నెలకొన్న అల్లకల్లోల పరిస్థితుల నేపథ్యంలో ప్రభాకరన్ బయటకు రావాల్సిన సమయం ఆసన్నమైందని నెడుమారన్ పేర్కొన్నాడు. అయితే ప్రభాకరన్ బతికే ఉన్నాడా? అన్న ప్రశ్నకు మాత్రం సమాధానాన్ని దాటవేశాడు నెడుమారన్. ప్రభాకరన్ తో తాము ఇప్పటికీ టచ్ లో ఉన్నామని, ఇప్పటికి ఇంతకంటే ఎక్కువ విషయాలు చెప్పలేనని అన్నాడు. మరి LTTE చీఫ్ ప్రభాకరన్ బతికే ఉన్నాడు అన్న నెడుమారన్ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
பிரபாகரன் நலமுடன் உள்ளார். #Prabakaran #PazhaNedumaran pic.twitter.com/JRvDq1Px92
— 𝐀𝐣𝐞𝐞𝐭𝐡 𝐊𝐫𝐢𝐬𝐡𝐧𝐚𝐬𝐚𝐦𝐲 (@AjeethK_) February 13, 2023