పెళ్లి వేడుకలో అందరూ సంతోషంగా ఉన్న సమయంలో ఒక్కసారే విషాదం నెలకొంది. పెళ్లి బారాత్ లో ఖుషీ ఖుషీగా ఎంజాయ్ చేస్తున్న సమయంలో అక్కడ వస్తున్న డీజే శబ్ధాల వల్ల పెళ్లి కొడుకు తండ్రికి గుండె ఆగిపోయి చనిపోయాడు. అంకిత్ అనే ఒక యువకుడికి ఇటీవల ఫేస్ బుక్ ద్వారా మల్కన్‌గిరికి చెందిన ఓ యువతి పరిచయం అయ్యింది. ఆ పరిచయం ప్రేమగా మారడంతో పెద్దలను ఒప్పించి పెళ్లికి సిద్దమయ్యారు. దీంతో నిశ్చితార్థం చేసుకునేందుకు యువకుడి కుటుంబం ఢిల్లీ నుంచి బుధవారం మల్కన్‌గిరి చేరుకుంది.
యువకుడి బంధువులు ఒక లాడ్జీలో బస చేశారు. వారిని తీసుకు వచ్చేందుకు యువతి కుటుంబ సభ్యులు మేళతాళాలతో చేరుకుంది. అదే సమయంలో భారీ స్థాయిలో డీజే సౌండ్ పెట్టి అక్కడికి వచ్చిన వారు డ్యాన్స్ చేయడం మొదలు పెట్టారు. ఆ సౌండ్ కి వరుడి తండ్రి మహేంద్ర రహిలా కు ఒక్కసారే గుండెపోటు వచ్చింది. దాంతో ఆయన అక్కడే కూలిపోయాడు. దీంతో ఇరు కుటుంబాల మద్య విషాదం చోటు చేసుకుంది. అయితే వ్యక్తి మరణానికి ఖచ్చితమైన కారణం ఇంకా నిర్ధారించబడనప్పటికీ, పెద్ద డీజే శబ్దం కారణంగా అతను గుండెపోటుకు గురయ్యాడని ఆరోపిస్తున్నారు.