దేశంలో టన్నుల కొద్దీ లిథియం నిల్వలు బయటపడ్డాయి. దాదాపు 9 లక్షల టన్నులు లిథియం రిజర్వులు వెలుగు చూసినట్లు కేంద్ర గనుల శాఖ ప్రకటన చేసింది. వీటితో పాటు దేశంలో 5 క్షేత్రాల్లో బంగారం నిక్షేపాలు ఉన్నట్లు కనుగొన్నారు.
దేశంలో తొలిసారి టన్నుల కొద్దీ లిథియం నిల్వలు బయటపడ్డాయి. జమ్మూకశ్మీర్‌లోని రిసాయి జిల్లాలో పరిధిలోని సలాల్ హైమనా ప్రాంతంలో సుమారు 5.9 మిలియన్ టన్నుల లిథియం రిజర్వ్‌లు ఉన్నట్లు కేంద్ర గనుల శాఖ ప్రకటించింది. ఈవీ బ్యాటరీల తయారీలో లిథియం మూలకం ప్రముఖమైనదన్న సంగతి తెలిసిందే. నాన్ ఫెర్రస్ మెటల్ అయిన లిథియంను ఈవీ బ్యాటరీల్లో వాడతారు. భవిష్యత్ అంతా ఎలక్ట్రిక్ వాహనాలదే అంటున్న తరుణంలో దేశంలో ఇంత పెద్ద మొత్తంలో లిథియం నిల్వలు బయటపడటం.. విద్యుత్ వాహనాల రంగానికి నూతన ఉత్తేజాన్ని ఇచ్చేలా ఉంది.
కేంద్ర గనుల శాఖ ఆధ్వర్యంలో దేశంలోని పలు ప్రాంతాల్లో ఎప్పటికప్పుడు నిక్షేపాల అన్వేషణ సాగుతూనే ఉంటుంది. అలా పరిశోధనలు చేస్తుండగా లిథియం నిక్షేపాలు ఉన్నట్లు బయటపడింది. జమ్మూకశ్మీర్‌లోని రిసాయి జిల్లాలో ఉన్న సలాల్ హైమనా ప్రాంతంలో జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా లిథియం, నిక్షేపాలు కనుగొన్నట్లు కేంద్ర గనుల శాఖ ట్విట్టర్ వేదికగా తెలిపింది. లిథియంతో పాటు 51 ఖనిజ క్షేత్రాలను గుర్తించి వాటి సమాచారాన్ని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు చేరవేసినట్లు తెలిపింది. వీటిల్లో 5 ప్రాంతాల్లో బంగారం నిల్వలు కాగా, మిగిలిన చోట్ల పొటాష్, మాలిబ్డినం, ఇతర బేస్ మూలకాలకు చెందిన నిక్షేపాలను గుర్తించారు. జమ్ముకశ్మీర్‌తో పాటు ఏపీ, చత్తీస్‌ఘడ్, జార్ఖండ్, గుజరాత్, కర్నాటక, మధ్యప్రదేశ్, ఒడిశా, రాజస్థాన్, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల్లో ఆ నిక్షేపాలు ఉన్నట్లు గనులశాఖ తెలిపింది.
వీటిల్లో 17 చోట్ల 7,897 మిలియన్ టన్నుల బొగ్గు, లిగ్నైట్ నిక్షేపాలు ఉన్నట్లు గుర్తించిన జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాటి ఉనికిని సంబంధించిన 17 నివేదికలను కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖకు అప్పగించింది. 2018-19 మధ్య నిర్వహించిన సర్వేల ఆధారంగా వీటిని గుర్తించినట్లు తెలిపింది. ఏదేమైనా లిథియం రిజర్వులు కనుగొనడం ద్వారా విద్యుత్ వాహనరంగానికి మరింత బలం చేకూరినట్లయ్యింది. భవిష్యత్‌లో విద్యుత్ వాహన బ్యాటరీల ధరలు తగ్గే అవకాశం ఉంది. అంతేకాదు.. దేశీయంగా తయారవుతోన్న స్మార్ట్‌ఫోన్ల ధరలు కూడా తగ్గుముఖం పపట్టొచ్చు. స్మార్ట్ ఫోన్లలో లిథియం అయాన్ బ్యాటరీలనే వాడుతున్నారు. లిథియం నిక్షేపాలు బయటపడటం వల్ల స్మార్ట్ ఫోన్ల ధరల వ్యత్యాసంలో ఎంత కొంత మార్పు ఉండవచ్చు.
Shri. Vivek Bharadwaj, IAS, Secretary, @MinesMinIndia handed over 16 geological reports (G2 & G3 stage) & 35 Geological memorandums to state governments during the 62nd Central Geological Programming Board (CGPB) meeting held today. pic.twitter.com/oZiQUQtc3w
— Ministry Of Mines (@MinesMinIndia) February 9, 2023