సాధారణంగా రాజకీయ నాయకులపై పదుల సంఖ్యలో పోలీసులు కేసులు నమోదు అవుతుంటాయి. ప్రజల కోసం పోరాడే సమయంలో ధర్నాలు, ర్యాలీలు, బంద్ లు ఇలాంటి సందర్భంలో రాజకీయ నాయకులపై ఎక్కువగా కేసులు నమోదు అవుతుంటాయి. ఇక మరికొందరిపై అత్యంత కఠినమైన కేసులు కూడా రిజిస్టర్ అవుతాయి. తాజాగా ఓ ఎంపీ మీద హత్యాయత్నం కేసు నమోదు అయ్యింది. ఈ కేసులో జిల్లా కోర్టు తీర్పు ఇస్తూ.. సదరు MPతో పాటుగా మరో ముగ్గురికి పదేళ్ల జైలు శిక్ష విధించింది. 2009లో నమోదు అయిన ఈ కేసుపై విచారణలు వింటూ వచ్చిన కోర్టు తాజాగా తన తీర్పును వెలువడించింది. ఈ తీర్పుకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..
రాజకీయాలలో ప్రత్యర్థుల నుంచి ఎప్పుడు ఏ దాడి జరుగుతుందో కనిపెట్టడం చాలా కష్టం. అందుకే రాజకీయాలను కత్తిమీద సాము అని వర్ణిస్తుంటారు. ఇక పాలిటిక్స్ లో శత్రువులను ఓ కంటకనిపెడుతుండాలి. లేకపోతే.. ప్రాణాలు దక్కించుకోవడం చాలా కష్టం. ఈ క్రమంలోనే ఓ రాజకీయ నాయకుడి హత్యకు ప్రయత్నించి జైలు పాలైయ్యాడు లక్షద్వీప్ ఎంపీ, ఎన్సీపీ నాయకుడు మహమ్మద్ ఫైజల్. వివరాల్లోకి వెళితే.. 2009 లోక్ సభ ఎన్నికల సమయంలో కేంద్రమాజీ మంత్రి, కాంగ్రెస్ నాయకుడు పీఎం సయీద్ అల్లుడు అయినటువంటి పదాంత సాలిహ్ ను హత్య చేయడానికి ఫైజల్ తో సహా మరో ముగ్గురు ప్రయత్నించారు. అప్పట్లో వీరిపై కేసు నమోదు అయ్యింది.
Breaking- Four people, including Lakshadweep MP Mohammed Faizal get 10-yr-jail term in an attempt to murder case.
— Brij Dwivedi (@Brij17g) January 11, 2023
ఈ కేసుపై విచారణ చేపట్టిన కోర్టు తాజాగా తన తీర్పును వెలువరించింది. రాజకీయ కక్షలతోనే అతడిపై హత్యాప్రయత్నం చేసినట్లు కోర్టు స్పష్టం చేసింది. దాంతో ఎంపీ ఫైజల్ తో సహా మరో ముగ్గురికి పదేళ్ల జైలు శిక్ష విధించింది. వారిని కేరళలోని కన్నూర్ సెంట్రల్ జైల్ కు తరలించారు. అయితే ఈ కేసు రాజకీయ దురుద్దేశంతో కూడుకున్నదని, తీర్పును హైకోర్టులో సవాల్ చేస్తున్నట్లు ఫైజల్ పేర్కొన్నాడు. ఫైజల్ కు శిక్ష పడటంతో అతడి రాజకీయ భవిష్యత్ పై నీలినీడలు కమ్ముకున్నాయి. క్రిమినల్ కేసులో దోషిగా తేలడంతో ఫైజల్ పై అనర్హత వేటుపడుతుందని న్యాయనిపుణులు చెబుతున్నారు.
A court in #Lakshadweep has sentenced four people, including Lakshadweep MP Mohammed Faizal to 10 years jail in connection with an attempt to murder case.https://t.co/GiWdUKuoJs
— The Hindu (@the_hindu) January 11, 2023