బీజేపీ సీనియర్ నాయకుడు, ఎంపీ కన్ను మూశారు. ఇప్పటికే బీజేపీ పార్టీకి చెందిన ఇద్దరు ప్రభావిత రాజకీయ నాయకులను కోల్పోయిన బీజేపీ ఇప్పుడు మూడవ నాయకుడ్ని కోల్పోయింది.
బీజేపీ పార్టీ సీనియర్ నాయకుడు, ఎంపీ గిరీష్ బాపట్ (73) కన్నుమూశారు. దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బుధవారం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఈరోజు ఆయన దీననాథ్ మంగేష్కర్ హాస్పిటల్ లో చేరారు. ఆరోగ్యం క్షీణించడంతో ఆయన మరణించారు. పుణెలోని కస్బాపేట్ నియోజకవర్గం నుంచి ఐదు సార్లు ఎమ్మెల్యేగా పని చేశారు. 2019లో లోక్ సభకు ఎన్నికైన బాపట్ మహారాష్ట్ర పౌర సరఫరాల శాఖ, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రిగా సేవలందించారు. బీజేపీలో చాలా తెలివి గల నాయకుడిగా పేరుంది. 1983లో జరిగిన పుణె మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో గెలిచి రాజకీయాల్లో చెరగని ముద్ర వేశారు.
సొంత పార్టీలోనే కాకుండా ప్రతిపక్ష పార్టీ నాయకులతో కూడా స్నేహభావంతో ఉంటారు. అజాత శత్రువుగా పేరున్న ఈయన మరణించడం తమ పార్టీకి తీరని లోటు అని బీజేపీ పార్టీ వెల్లడించింది. ఇప్పటికే బీజేపీ పార్టీ గడిచిన నాలుగు నెలల్లోనే ఇద్దరు ప్రముఖ నాయకులను కోల్పోయింది. కస్బాపేట్ ఎమ్మెల్యే ముక్త తిలక్, చించ్ వాడ్ సిట్టింగ్ ఎమ్మెల్యే లక్ష్మణ్ జగ్తప్ లను కోల్పోగా ఇప్పుడు గిరీష్ బాపట్ ను కోల్పోయింది. బాపట్ మరణంపై బీజేపీ నాయకులు సంతాపం తెలియజేస్తున్నారు. ఈ విషాద సమయంలో పార్టీ బాపట్ కుటుంబ సభ్యులకు అండగా ఉంటామని హామీ ఇచ్చింది.
బాపట్ మరణంపై ప్రధాని మోదీ విచారం వ్యక్తం చేశారు. బాపట్ నిరాడంబరమైన వ్యక్తి అని, కష్టపడి పని చేసే స్వభావం కలిగిన నేత అని అన్నారు. సమాజం పట్ల అంకితభావంతో పని చేశారని, మహారాష్ట్ర అభ్యున్నతి కోసం పనిచేశారని అన్నారు. పుణె అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టి కృషి చేసిన నేత మరణించడం బాధాకరమని అన్నారు. మహారాష్ట్రలో బీజేపీ నిర్మాణం, బలోపేతంలో కీలక పాత్ర పోషించారని గిరీష్ బాపట్ ను కొనియాడారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు మోదీ. గిరీష్ బాపట్ కు సద్గతులు ప్రాప్టించాలని కోరుకుందాం. ఓం శాంతి.
Hundreds of BJP workers and followers of MP Girish Bapat reach his residence for last glimpse of their leader.#BJP @BJPForPuneCity @BJP4PMCPune @BJP4India pic.twitter.com/wC92vF6yI3
— Pune Mirror (@ThePuneMirror) March 29, 2023