వచ్చే ఎడాది సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలు ఇప్పటి నుంచి వ్యూహాలు రచించడం మొదలు పెట్టారు. ర్యాలీలు, పాదయాత్రలు, భారీ బహిరంగా సభలు ఇలా పలు రకాలుగా ప్రజల్లోకి వెళ్లి వారిని ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డాయి.
దేశ వ్యాప్తంగా త్వరలో రాబోయే సార్వత్రిక ఎన్నికల కోసం రాజకీయ పార్టీలు అన్ని రకాలుగా సిద్దమవుతున్నాయి. ఇప్పటికే పాదయాత్రలు, ర్యాలీలు, భారీ బహిరంగా సభలు, ప్రజా క్షేత్రంలోకి వెళ్లి వారితో మాట్లాడటం లాంటివి చేస్తూనే ఉన్నారు. అన్ని పార్టీలు ఎన్నికలకు సంసిద్దం అవుతున్న సమయంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. సీపీఐ, టీఎంసీ, ఎన్సీపీ లకు కేంద్ర ఎన్నికల సంఘం భారీ షాక్ ఇచ్చింది. ఈ పార్టీల జాతీయ హూదాను రద్దు చేసింది. పూర్తి వివరాల్లోకి వెళితే..
వచ్చే ఏడాది దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల జరగబోతున్న సమయంలో కీలక పరిణాం చోటు చేసుకుంది. తాజాగా పశ్చిమ బెంగాల్ అధికా పార్టీ తృణముల్ కాంగ్రెస్ (టీఎంసీ), శరత్ పవార్ సారధ్యంలో నడుస్తున్న నేషనల్ కాంగ్రెస్ పార్టీ (ఎన్ సీపీ), కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (సీపీఐ) పార్టీలకు కేంద్ర ఎన్నికల సంఘం జాతీయ హూదా తొలగిస్తూ సోమవారం సీఈసీ ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే కొత్తగా ఆమ్ ఆద్మీ పార్టీకి జాతీయ హూదా కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో సీఈసీ అనూహ్యమైన ట్విస్ట్ ఇవ్వడంతో దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. మరోవైను బీఆర్ఎస్ పార్టీకి కేటాయించిన గుర్తింపు కూడా రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఢిల్లీ, గోవా, పంజాబ్, గుజరాత్ రాష్ట్రాల్లో ఎన్నికల ఫలితాల ఆధారంగా ఆప్ కి జాతీయ హోదా కల్పించినట్లు సోమవారం ప్రకటించింది.