ఈరోజుల్లో చిరు ఉద్యోగాలు చేసుకునే వారికే సొంత ఇళ్ళు ఉంటున్నాయి. ఇక రాజకీయ నేతల గురించి అయితే ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. గల్లీ లీడర్ నుంచి ఢిల్లీ లీడర్ వరకూ ప్రతి ఒక్కరికీ సొంత ఇళ్ళు ఉంటాయి. అయితే జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీకి ఇప్పటి వరకూ ఒక సొంత ఇల్లు లేదని చెబుతున్నారు.
భారతదేశ తొలి మహిళా రాష్ట్రపతిగా ఎంతోపేరు గడించారు ప్రతిభా పాటిల్. అలాంటి ప్రతిభా పాటిల్ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. అసలేం జరిగిందంటే..!
సాధారణంగా రాజకీయ నాయకులపై పదుల సంఖ్యలో పోలీసులు కేసులు నమోదు అవుతుంటాయి. ప్రజల కోసం పోరాడే సమయంలో ధర్నాలు, ర్యాలీలు, బంద్ లు ఇలాంటి సందర్భంలో రాజకీయ నాయకులపై ఎక్కువగా కేసులు నమోదు అవుతుంటాయి. ఇక మరికొందరిపై అత్యంత కఠినమైన కేసులు కూడా రిజిస్టర్ అవుతాయి. తాజాగా ఓ ఎంపీ మీద హత్యాయత్నం కేసు నమోదు అయ్యింది. ఈ కేసులో జిల్లా కోర్టు తీర్పు ఇస్తూ.. సదరు MPతో పాటుగా మరో ముగ్గురికి పదేళ్ల జైలు శిక్ష […]
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల సమస్యలను దృష్టిలో పెట్టుకుని.. కొత్త కొత్త పథకాలను ఎప్పటికప్పుడు అమలు చేస్తూనే ఉంటాయి. ఆ పథకాల వల్ల పేదరికాన్ని దేశం, రాష్ట్రం నుంచి వెళ్లగొట్టాలి అన్నదే ఆ ప్రభుత్వాల ధ్యేయం. అందులో భాగంగానే తాజాగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో శుక్రవారం జరిగిన సమావేశంలో కేంద్రమంత్రి వర్గం కీలక నిర్ణయం తీసుకుంది. జాతీయ ఆహార భద్రతా చట్టం (NFSA) కింద దేశంలో ఉన్న 81.35 కోట్ల మంది పేదలకు సంవత్సరం […]
రుణమాఫీ అనే పదం రైతులకు ఎంతో సంతోషాన్నిచ్చే పదం. రుణమాఫీ అనేది రైతులకే కాదు, రాజకీయ నాయకులకు కూడా అస్త్రమే. రైతులు గెలవాలన్నా, రాజకీయ నాయకులు గెలవాలన్నా రాజకీయ డిక్షనరీలో రుణమాఫీ అన్న పదం ఉండాల్సిందే. అధికారంలోకి రావడం కోసం ఉపయోగించే హామీ అస్త్రాల్లో ఈ రుణమాఫీ ఒకటి. రుణమాఫీ చేస్తామని చెప్తే రైతుల ఓట్లు పడతాయన్న నమ్మకం రాజకీయ నాయకులది. ఈ క్రమంలో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చే వాళ్ళు చాలా మంది ఉంటారు. అయితే […]
టీఆర్ఎస్ పార్టీని జాతీయ పార్టీగా ప్రకటించాలని ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న కేసీఆర్ ఎట్టకేలకు బీఆర్ఎస్ పార్టీని ప్రకటించారు. టీఆర్ఎస్ పార్టీ నేడు (డిసెంబర్ 9న) బీఆర్ఎస్ పార్టీగా అవతరించిన విషయం తెలిసిందే. తెలంగాణ భవన్ లో మధ్యాహ్నం 1.20 నిమిషాలకు కేసీఆర్ సంతకంతో టీఆర్ఎస్ జాతీయ పార్టీగా అవతరించింది. ఈ శుభ వేడుకకు కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి, సినీ నటుడు ప్రకాష్ రాజ్ పాల్గొన్నారు. బీఆర్ఎస్ సంబరాల్లో నటుడు ప్రకాష్ రాజ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అయితే […]
ప్రస్తుతం భారత్ జోడో యాత్రలో భాగంగా ప్రజలను పలకరించుకుంటూ వెళ్తున్న కాంగ్రెస్ పార్టీ ఎంపీ రాహుల్ గాంధీపై కేసు నమోదైంది. మహారాష్ట్ర అకోలాలో గురువారం మీడియా సమావేశంలో ఆయన చేసిన వ్యాఖ్యలే ఇందుకు కారణం. స్వాతంత్య్ర పోరాటయోధుడు వినాయక్ దామోదర్ సావర్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారని, అలానే స్థానికుల మనోభావాలు దెబ్బతీశారని రాహుల్ గాంధీపై బాలాసాహెబంచి శివసేన నాయకురాలు వందన సుహాస్ డోంగ్రే గురువారం థానే నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పోలీసులు […]
భారతదేశంలో క్రీడలకు, రాజకీయాలకు అవినాభావ సంబంధం ఉంది. ఎంతో మంది క్రీడాకారులు తమ క్రికెట్ కెరీర్ కు వీడ్కోలు పలికాక రాజకీయాల్లోకి అడగుపెట్టిన సందర్భాలు కోకొల్లలు. కానీ క్రికెటర్ల భార్యలు, సోదరీమణులు రాజకీయాల్లోకి అడుగుపెట్టిన సందర్బాలు చాలా అరుదు. అయితే తాజాగా టీమిండియా క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య రివాబా జడేజాకు బీజేపీ టికెట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇంకేంటి మరి సంతోషమే కదా అని అనుకుంటున్నారా? ఇక్కడే ఓ తిరకాసు ఉంది అదే నియోజకవర్గం నుంచి […]
సినిమాలకి, రాజకీయాలకి బాగా దగ్గర సంబంధం ఉంటుంది. ఈ సినిమా, రాజకీయం రెండూ నాణానికి చెరో వైపున ఉండే బొమ్మ, బొరుసు లాంటివి. రాజకీయ నాయకులు సినిమాలు చేస్తారు, సినిమాల్లో పెట్టుబడులు పెడతారు. అలానే సినిమా వాళ్ళు రాజకీయాల్లోకి ప్రవేశించి ప్రజా సేవ చేస్తారు. సినిమా వాళ్ళ క్రేజ్ ని రాజకీయ నాయకులు తమ పొలిటికల్ క్యాంపెయినింగ్ కోసం వాడుకుంటారు కూడా. ఈ క్రమంలో తమ క్రేజ్ ని రాజకీయాల్లో స్వయంగా వాడుకుని నాయకులుగా ఎదగాలని ప్రతీ […]
భారతీయ జనతా పార్టీపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఘాటు వ్యాఖ్యలు చేశారు. బీజేపీ పాలిత ప్రాంతాల్లో ముస్లింల కంటే వీధి కుక్కలకే ఎక్కువ గౌరవం ఇస్తున్నారని వ్యాఖ్యానించారు. శనివారం జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన ఈ విధంగా వ్యాఖ్యలు చేశారు. దేశంలో బీజేపీ ఎక్కడ ఉంటే అక్కడ ముస్లింలు బహిరంగ జైల్లో జీవిస్తున్నట్టే ఉందని వ్యాఖ్యలు చేశారు. కొన్ని రోజుల క్రితం గుజరాత్ ఖేడాలోని ఉందేలా గ్రామంలో ముస్లింలపై పోలీసులు జరిపిన దాడుల్ని ప్రస్తావిస్తూ ఈ […]