దేనికైనా మనకంటూ రాసిపెట్టి ఉంటేనే జరుగుతుంది. మనకంటూ ఒక్క రోజు వచ్చే వరకు వేచి ఉండాలి. అప్పటి వరకు ఎన్ని కష్టాలు ఉన్న భరించక తప్పదు. రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి ఆ కుటుంబానిది. అలాంటి కుటుంబానికి అనుకోకుండా ఓ రోజు వజ్రం రూపంలో అదృష్టం వరించింది. అదృష్టం కలిసి వచ్చి గిరిజన కూలీ నుంచి లక్షాధికారి అయినాడు ఓ వ్యక్తి. ఈ సంఘటన మధ్యప్రదేశ్ లో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే..మధ్యప్రదేశ్‌లోని బుందేల్‌ఖండ్ ప్రాంతంలోని పన్నా వజ్రాల గనులు ప్రపంచ ప్రఖ్యాతి గాంచాయి. అదే ప్రాంతలో ములాయం సింగ్ అనే గిరిజనుడు కాయకష్టం చేసి జీవిస్తుంటాడు. కూలీకి వెళితేనే ఆ కుటుంబానికి తిండి దొరికేది. అలా ప్రతీరోజు జీవితంతో పోరాటం చేయాల్సిందే. పిల్లలను ఉన్నత చదువులు చదివిచాలన్నా కూడా భార్యాభర్తలు ఇద్దరూ కష్టడాల్సిందే.. అటువంటి ములాయం సింగ్ కు పన్నా వజ్రాల గనుల్లో గత బుధవారం ఓ వజ్రం దొరికింది. ములాయంకు దొరికిన ఆ వజ్రం 13.54 క్యారెట్‌ల బరువుంది.దాని విలువను రూ.60 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారని ఇన్‌స్పెక్టర్ అనుపమ్ సింగ్ చెప్పారు.
మధ్యప్రదేశ్‌లోని బుందేల్‌ఖండ్ ప్రాంతంలోని పన్నా వజ్రాల గనుల్లో గిరిజనలు కూలీలుగా పనిచేస్తుంటారు. అప్పుడప్పుడు వజ్రాలు దొరికి ఆ గనుల్లో పనిచేసే కూలీలు రాత్రికి రాత్రే లక్షాధికారులవుతుంటారు. అదే విధంగా కూలీ అయిన ములాయం సింగ్ ని అదృష్టం వరించింది. ఇతనితో పాటు మరికొందరికి వేరు వేరు రకాల వజ్రాలు దొరికినట్లు సమాచారం. తాజాగా ములాయం సింగ్ కు మాత్రం ఈ అతి విలువైన వజ్రం దొరికింది. కష్టానికి తోడు అదృష్టం కూడా వరిస్తే కూలీల కష్టం తీరిపోతుంది. అలా ములాయంకి అదృష్టం వరించింది. ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలిజేయండి.