స్నేహం అంటే ప్రజల మధ్య ఉన్న సంబంధం, అది ఏ ప్రయోజనానికి మద్దతు ఇవ్వదు. స్నేహం అనే పదం యొక్క అర్ధాన్ని అర్థం చేసుకోని వ్యక్తిని ప్రపంచంలో కనుగొనడం చాలా అరుదు. మంచి మిత్రుడిని మించిన ఆస్తి లేదంటారు. ఎందుకంటే మంచి మిత్రుడు స్నేహితుడి మంచిని కోరుకుంటాడు. ఆపదలో ఆదుకుంటాడు. బాధలో ఓదార్పు అవుతాడు. కష్టానష్టాలలో మంచి మిత్రుడు వెన్నంటే ఉంటాడు.
మంచి మిత్రుడిని మించిన ఆస్తి ఉండదని అంటారు. స్నేహం గొప్పతనం మంచి మిత్రుడు స్నేహం వలననే తెలియబడుతుంది. స్నేహబంధం మీద ఎన్నో చిత్రాలు వచ్చాయి.. సూపర్ హిట్ అయ్యాయి. తాజాగా సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. నిజమైన స్నేహానికి అర్థం వీరే అంటూ నెటిజన్స్ కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు.
కొల్లాం జిల్లా కు చెందిన అలీఫ్ మహ్మద్ అనే యువకుడు బీకాం చదువుతున్నాడు. చిన్నప్పటి నుంచి అలీఫ్ కి కాళ్లు లేవు.. అయినా కూడా పట్టదలతో చదువుతూ డిగ్రీ వరకు వచ్చాడు. చిన్నప్పటి నుంచి తనకు అంగవైకల్యం అన్న విషయం తెలియకుండా ఉంచారు అతని స్నేహితులు. ప్రస్తుతం అలీఫ్ కాలేజ్ కి వచ్చేందుకు అతని స్నేహితురాళ్లు అతడికి సహాయం చేస్తూ ఉంటారు. అతనికి ఏ చిన్న అవసరం ఉన్నా దగ్గరుండి మరీ చూసుకుంటారు. వీళ్ల స్నేహం చూసి కాలేజ్ విద్యార్థులు, ఉపాధ్యాయులు సైతం ఎంతో సంతోషం వ్యక్తం చేస్తుంటారు.
వీళ్ల స్నేహం గురించి ఓ ఫోటో గ్రాఫర్ మాట్లాడుతూ.. ఇటీవల కాలేజ్ లో జరిగిన ఒక కార్యక్రమంలో ఫోటో షూట్స్ తీస్తున్న సమయంలో ఒక అపురూప దృశ్యం కనిపించిందని.. అలీఫ్ ని తమ భుజాలపై ఎక్కించుకుకొని తీసుకు వెళ్లడం చూసి.. ఆ క్షణం నా కళ్లు చెమ్మగిల్లాయని.. వెంటనే తన కెమెరాలో బంధించానని చెప్పాడు. ఆ వీడియో ఎంతో పాపులర్ అయ్యిందని అన్నాడు. ఇంత గొప్ప స్నేహం గురించి మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.