కాలేజీ అంటే చదువు మాత్రమే కాక ఎన్నో అందమైన జ్ఞాపకాలకు వేదికగా నిలుస్తుంది. జీవితాంతం తోడుగా నిలిచే స్నేహ బంధాలు కాలేజీలోనే కలుస్తాయి. కానీ ఓ జంటకు మాత్రం అంతకు మించిన అందమైన జ్ఞాపకాన్ని సొంతం చేసుకుంది. అదేంటంటే..
సాధారణంగా కాలేజీల్లో జరిగే యూత్ ఫెస్ట్‌లంటే.. విద్యార్థులంతా కలిసి.. సరదగా గడుపుతారు. స్నేహితులతో పిచ్చపాటి ఎంజాయ్ చేస్తారు. కానీ ఇప్పుడు మీరు తెలుసుకోబోయే కాలేజ్ ఫెస్ట్ మాత్రం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. స్నేహితులతో కలిసి సరదాగా ఎంజాయ్ చేసే ఈ వేదిక కాస్త.. ఉన్నట్లుండి వివాహ వేదికగా మారింది. స్నేహితులే పెళ్లి పెద్దలై.. ఓ జంటకు పెళ్లి చేశారు. మరి ఇంతకు వారు కాలేజ్ ఫెస్ట్‌లో ఎందుకు వివాహం చేసుకోవాల్సి వచ్చింది.. దీని వెనక ఉన్న కథ ఏంటో తెలియాలంటే ఇది చదవండి.
ఈ సంఘటన కేరళ ఎర్నాకులంలో చోటు చేసుకుంది. ఇక్కడ ఉన్న మహారాజా కళాశాలలో నదీమ్, కృపా ఇద్దరు డిగ్రీ పూర్తి చేశారు. 2014-2017లో వీరు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశారు. ఇక డిగ్రీ చదువుతుండగానే.. నదీమ్, కృపా మధ్య పరిచయం ఏర్పడి అది కాస్త ప్రేమగా మారింది. సుమారు తొమ్మిదేళ్ల నుంచి వీరిద్దరూ ప్రేమించుకుంటున్నారు. డిగ్రీలో మొదలైన ప్రేమ.. ఇప్పటి వరకు కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం ఇద్దరు ఉద్యోగాల్లో సెటిల్ అయ్యారు. తమ ప్రేమ గురించి ఇంట్లో చెప్పి.. పెళ్లికి పెద్దల అనుమతి కోరారు. కానీ వారు అంగీకరించలేదు.
ఈ క్రమంలో నదీమ్, కృపాలు తమ మధ్య ప్రేమ చిగురించిన కాలేజేలోనే.. దాన్ని వివాహ బంధంగా మార్చుకోవాలని భావించారు. ఈ క్రమంలో కాలేజీలో జరుగుతున్న యూత్ ఫెస్ట్‌లో తమ స్నేహితుల మద్దతుతో పెళ్లి చేసుకుని.. వివాహ బంధంలోకి అడుగుపెట్టారు నదీమ్, కృపా. స్నేహితుల సమక్షంలో.. పెళ్లి చేసుకుని నూతన జీవితాన్ని ప్రారంభించబోతున్నారు. ఎక్కడైతే ప్రేమలో పడ్డారో.. అక్కడే దాన్ని గెలిపించుకున్న ఈ జంటపై ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజనులు. మరి ఈ జంట చేసిన పనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి