ప్రపంచ వ్యాప్తంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకుంటారు. ఇక మన దేశంలో అయితే అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వివిధ రంగాల్లో ప్రతిభను చాటుకున్న మహిళలకు సన్మానాలు, సత్కారాలు చేస్తూ సందడి చేస్తుంటారు రాజకీయ నేతలు.
దేశ వ్యాప్తంగా ఎంతో అట్టహాసంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు జరుపుతుంటారు. వివిధ విభాగాల్లో తమ ప్రతిభను చాటిన మహిళలకు గౌవర సత్కారాలు చేయడం.. సన్మానాలు చేయడం చూస్తుంటాం. వేదికలన్నీ స్త్రీ శక్తి గురించి ఎంతో గొప్పగా చెబుతూ సంబరాలు జరుపుతుంటారు. ఇక వివిధ పార్టీ రాజకీయ నేతలు మహిళలను ఉద్దేశించి గొప్ప గొప్ప ఉపన్యాసాలు ఇస్తుంటారు. అలాంటిది అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు ఓ రాజకీయ నేత మహిళను ఘోరంగా అవమానించాడు.. కేవలం బొట్టు పెట్టుకోలేదన్న కారణంతో ఆమెను నోటికి వచ్చినట్లు తిట్టాడు. ఈ ఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వివరాల్లోకి వెళితే..
కర్ణాటక లోకి కోలార్ జిల్లాలో మహిళా దినోత్సవం సందర్భంగా బీజేపీ ఎంపీ మునిస్వామి ఒక షాపింగ్ మార్కెట్ ను ప్రారంభించారు. షాపింగ్ మార్కెట్ లో వివిధ స్టాల్స్ తిరుగుతూ మహిళలను పలకరిస్తూ వచ్చారు ఎంపీ మునిస్వామి. ఈ నేపథ్యంలో ఓ స్టాల్ మహిళను పలకరించి నీ పేరు ఎంటని ప్రశ్నించాడు. ఆమె తన పేరు సుజాత అని సమాధానం చెప్పింది. మరి నుదుట కుంకుమ బొట్టు ఎందుకు పెట్టుకోలేదు అని ప్రశ్నించారు.. అంతే కాదు నీ స్టాల్ కి వైష్ణవి అని పేరు పెట్టుకున్నావు.. మరి నుదుట బొట్టు పెట్టుకోవాలని తెలియదా..? ముందు బొట్టు పెట్టుకో.. నీ భర్త బతికే ఉన్నాడా? ఎవరైనా డబ్బులు ఇస్తే చాలు వెంటనే వేరే మతంలోకి మారిపోతారు.. అంటూ ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి వారికి ఏమాత్రం కామన్సెన్స్ లేకుండా పోతుంది.. అంటూ ఆ మహిళకు చివాట్లు పెట్టాడు.. పక్కన మరో మహిళతో ఆమెకు బొట్టు ఇవ్వు అని కోపంగా చెప్పి అక్కడ నుంచి వెళ్లిపోయారు.
ఈ సంఘటనను అక్కడే ఉన్న ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. సదరు మహిళలపై ఎంపీ మునుస్వామి ఫైర్ అయిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. దీంతో ఎంపీ మునుస్వామిపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై కాంగ్రెస్ నేత ఎంపీ కార్తి పి చిదంబరం స్పందిస్తూ.. భారత్ ని బీజేపీ హిందుత్వ ఇరాన్ గా మార్చాలని చూస్తుందని అసహనం వ్యక్తం చేశారు. మహిళా దినోత్సవం అంటూ ఊకదంపుడు ఉపన్యాసాలు ఇవ్వడం కాదు.. మహిళలను ఎలా గౌరవించాలో బీజేపీ నాయకులు తెలుసుకోవాలని కాంగ్రెస్ తీవ్రంగా విమర్శలు చేస్తుంది. కొంత మంది నెటిజన్లు మునుస్వామిని తిడుతూ కామెంట్స్ చేస్తున్నారు.. ఓ మహిళ బొట్టు పెట్టుకోవాలో లేదో చెప్పడానికి ఆయన ఎవరు అని ప్రశ్నిస్తున్నారు.
The @BJP4India will turn India into a “Hindutva Iran” The Ayatollahs of the BJP will have their version of the “Moral Police” patrolling the streets.
— Karti P Chidambaram (@KartiPC) March 8, 2023