భారత అమ్ములపొదిలోకి మరో క్షిపణి చేరింది. రక్షణ శాఖ బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిస్ క్షిపణి కొత్త వర్షన్ ను విజయవంతంగా పరీక్షించింది. గురువారం ఈ నిర్వహించిన ప్రయోగం విజయవంతమైనట్లు రక్షణ శాఖ వర్గాలు వెల్లడించాయి. భారత్ సరిహద్దుల్లో పాక్- చైనా దేశాలతో ఉద్రిక్తతల నడుమ ఈ పరీక్షలకు ప్రాధాన్యత సంతరించుకుంది. మరోవైపు ఈ అనిశ్చిత పరిస్థితుల దృష్ట్యా బ్రహ్మోస్ కొత్త వర్షన్ లను పరిక్షిస్తూనే ఉంది. తాజాగా ఒడిశా కోస్టల్ ప్రాంతం బాలాసూర్ నుంచి ఈ ప్రయోగం నిర్వహించారు. DRDO అధికారులను రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అభినందించారు.
BrahMos Missile was successfully test fired from ITR, Chandipur today. The mission validated many new indigenous systems successfully demonstrating enhanced capabilities. #MakeinIndia@DefenceMinIndia@BrahmosMissile@SpokespersonMoD#AtmaNirbharBharat pic.twitter.com/bHS7t24gSd
— DRDO (@DRDO_India) January 20, 2022
బ్రహ్మోస్ ప్రత్యేకతలు:
బ్రహ్మోస్ క్షిపణి అభివృద్ధి ఇండియా- రష్యా సంయుక్తంగా చేపట్టిన కార్యక్రమం. ఈ క్షిపణికి భారత్ లోని బ్రహ్మపుత్ర, రష్యాలోని Moskva అనే నదుల పేర్లను కలుపుతూ BrahMos అని పేరు పెట్టారు. ఈ క్షిపణి 3,457.44 kmph(2.8 Mach) వేగంతో ప్రయాణించగలదు. ఈ క్షిపణిని సబ్ మెరైన్స్, ఓడలు, విమానాలు, నేలపై నుంచి కూడా ప్రయోగించవచ్చు. భారత్ ఇప్పటికే బ్రహ్మోస్ క్షిపణులను తయారు చేసి పలు చోట్ల భద్రపరిచింది.
BrahMos supersonic cruise missile, with enhanced capability, successfully test-fired off Odisha coasthttps://t.co/7L758zZ2qy pic.twitter.com/aSMIULMjp2
— DRDO (@DRDO_India) January 20, 2022
‘భారతదేశం బ్రహ్మోస్ క్షిపణులను తయారు చేస్తోంది. ఏ దేశం కూడా భారత్ పై దాడి చేసేందుకు ధైర్యం చేయలేదు’ అంటూ ఆదివారం రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ పరోక్షంగా పాకిస్తాన్ కు హెచ్చరిక జారీ చేశారు.