భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్‌డీఓ) భారీ జాబ్ నోటిఫికేషన్ విడుదలచేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా దేశవ్యాప్తంగా డీఆర్‌డీఓ పరిశోధనా కేంద్రాల్లో ఉన్న 1061 జూనియర్ ట్రాన్స్‌లేషన్ ఆఫీసర్, స్టెనోగ్రాఫర్, అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్, స్టోర్ అసిస్టెంట్, ఫైర్‌మ్యాన్, వెహికల్ ఆపరేటర్, ఫైర్ ఇంజిన్ డ్రైవర్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పోస్టులకు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ నవంబర్ 11 నుంచి ప్రారంభమవుతుంది.
మొత్తం ఖాళీలు: 1061 (జనరల్-679; ఎస్సీ-71; ఎస్టీ-40; ఓబీసీ 204; ఈడబ్ల్యూఎస్-67)
అర్హతలు: సంబంధిత పోస్టులను బట్టి 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణులై ఉండాలి. అలాగే.. టైపింగ్ పరిజ్ఞానం, డ్రైవింగ్ లైసెన్సు కలిగి ఉండాలి.
వయోపరిమితి: స్టెనోగ్రాఫర్ గ్రేడ్-2, అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ ‘ఎ’, స్టోర్ అసిస్టెంట్ ‘ఎ’, వెహికల్ ఆపరేటర్ ‘ఎ’, ఫైర్ ఇంజిన్ డ్రైవర్ ‘ఎ’, ఫైర్‌మ్యాన్ పోస్టులకు 18 నుంచి 27 ఏళ్ల మధ్య, జేటీవో, స్టెనోగ్రాఫర్ గ్రేడ్-1 పోస్టులకు- 30 ఏళ్లు మించకూడదు.
దరఖాస్తు ఫీజు: జనరల్/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్ మరియు ఇతర అభ్యర్థులు రూ.100 చెల్లించాలి(ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు మినహాయింపు ఉంటుంది).
జీత భత్యాలు: జేటీవో, స్టెనోగ్రాఫర్ గ్రేడ్-1 పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు నెలకు రూ.35,400-రూ.1,12,400; స్టెనోగ్రాఫర్ గ్రేడ్-2 పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు నెలకు రూ.25,500-రూ.81,100; ఇతర పోస్టులకు నెలకు రూ.19,900- రూ.63,200 వరకు ఉంటుంది.
ఎంపిక విధానం: పోస్టును అనుసరించి టైర్-1(సీబీటీ), టైర్-2(నైపుణ్య, శారీరక దృఢత్వ, సామర్థ్య పరీక్షలు) తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు ప్రారంభ తేదీ: నవంబర్ 11, 2022
దరఖాస్తులకు చివరితేది: అక్టోబర్ 12, 2022