చైనా, పాకిస్తాన్ వంటి శత్రుదేశాలు నేలపై నుంచే కాకుండా నీటిపైనుంచి కూడా దాడులకు దిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో భారత రక్షణ శాఖ మంత్రి నావికా దళానికి ఓ పిలుపు నిచ్చారు. భవిష్యత్తు గొడవలకు సిద్ధంగా ఉండాలని అన్నారు.
సీనియర్ నటులు, కేంద్ర మాజీ మంత్రి, రెబల్ స్టార్ కృష్ణంరాజు ఆదివారం అనారోగ్యంతో మరణించిన విషయం తెలిసిందే. వారి ఫామ్ హౌస్‌లో ఆయన అంత్యక్రియలు సోమవారం కుటుంబ సభ్యులు నిర్వహించారు. ఆయన మృతితో ఒక్కసారిగా తెలుగు చిత్రపరిశ్రమ మూగబోయింది. పెద్ద ఎత్తున సినీ, రాజకీయ ప్రముఖులు ఆయన మృతికి సంతాపం తెలిపారు. కృష్ణంరాజు సినిమాలతో పాటు రాజకీయాల్లో రాణించారు. అటల బిహరీ వాజపేయి హయాంలో కేంద్ర మంత్రిగా పనిచేశారు. బీజేపీ నాయకులతో కృష్ణంరాజుకు మంచి సంబంధాలు ఉన్నాయి. […]
టాలీవుడ్ కి చెందిన సినిమా హీరోలతో బీజేపీ అగ్రనేతలు భేటీ అవుతుండడం చర్చనీయాంశం అవుతుంది. ఇటీవల బీజేపీ అగ్రనేత కేంద్ర హోం మంత్రి అమిత్ షా.. ఎన్టీఆర్ తో భేటీ అవ్వడం, ఆ తర్వాత నితిన్ తో భేటీ అవ్వడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. అయితే ఈ హీరోలతో రాజకీయ భేటీ కాదని, వ్యక్తిగత భేటీ మాత్రమే అని బీజేపీ వర్గాలు వెల్లడించాయి. తాజాగా అమిత్ షా.. ప్రభాస్ తో భేటీ అవ్వనున్నారు. […]
పెరుగుతున్న ఇంధన ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరలతో పాటు వంట గ్యాస్ ధరలు కూడా భారీగా పెరిగాయి. ఇక ఇంధన ధరల పెరుగుదలతో.. నిత్యవసరాల ధరలు కూడా పెరిగి.. ప్రజలు తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఇకపై ఏడాదికి రెండు సార్లు ఉచితంగా గ్యాస్ సిలిండర్లు అందజేస్తామని ప్రకటించింది. అబ్బ ఎంత మంచి ఆఫరో కదా అని సంబరపడుతున్నారా.. ఆగండి.. అసలు సంగతి వేరే ఉంది. […]
పుష్ప.. పుష్ప రాజ్.. ప్రజల్లో ఈ మేనియా ఇంకా తగ్గట్లేదు. ఎక్కడ చూసినా ప్రతి ఒక్కరు తగ్గేదేలే అంటున్నారు. సాధారణ ప్రజలే కాదు.. సినిమా వాళ్లు, సెలబ్రిటీలు, ఆఖరికి రాజకీయ నాయకుల నోట కూడా అదే మాట. భాషతో సంబంధం లేకుండా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ డైలాగులు మొత్తం వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఎన్నికల ప్రచారాల్లోనూ పుష్ప ఫీవర్ కనిపిస్తోంది. ఇటీవల కాంగ్రెస్ ఎన్నికల ప్రచారగీతాన్ని శ్రీవల్లి సాంగ్ ట్యూన్ తో విడుదల […]
భారత అమ్ములపొదిలోకి మరో క్షిపణి చేరింది. రక్షణ శాఖ బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిస్ క్షిపణి కొత్త వర్షన్ ను విజయవంతంగా పరీక్షించింది. గురువారం ఈ నిర్వహించిన ప్రయోగం విజయవంతమైనట్లు రక్షణ శాఖ వర్గాలు వెల్లడించాయి. భారత్ సరిహద్దుల్లో పాక్- చైనా దేశాలతో ఉద్రిక్తతల నడుమ ఈ పరీక్షలకు ప్రాధాన్యత సంతరించుకుంది. మరోవైపు ఈ అనిశ్చిత పరిస్థితుల దృష్ట్యా బ్రహ్మోస్ కొత్త వర్షన్ లను పరిక్షిస్తూనే ఉంది. తాజాగా ఒడిశా కోస్టల్ ప్రాంతం బాలాసూర్ నుంచి ఈ […]
దేశంలో కరోనా మహమ్మారి అలజడి సృష్టిస్తోంది. సాధారణ ప్రజల నుంచి సెలబ్రిటీల వరకు అందరూ కరోనా బారిన పడుతున్నారు. తాజాగా కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాధ్ సింగ్ కరోనా బారిన పడ్డారు. స్వల్ప లక్షణాలు ఉండటంతో వైద్యుల సలహాలతో ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో ఉన్నట్లు తెలిపారు. గత కొన్ని రోజులుగా తనను కలిసిన వారు కోవిడ్ టెస్ట్‌లు చేసుకోవాలని సూచించారు. I have tested positive for Corona today with mild symptoms. I am under home […]
ఓవైపు దాయాది పాకిస్తాన్, మరో వైపు డ్రాగన్ చైనాలు మన దేశంపై దాడి చేసేందుకు నిత్యం కాలు దువ్వుతూనే ఉంటాయి. భారత్ కూడా వీటికి ధీటుగా బదులిస్తుంటుంది. ఈ రెండు దేశాల ఆగడాలను దృష్టిలో పెట్టుకుని భారత్ తన ఆయుధ సంపత్తిని పెంచుకుంటుంది. ఈ క్రమంలో భారత అమ్ముల పొదిలోకి మరో అద్భుత అస్త్రం చేరింది. డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ అభివృద్ధి చేసిన స్వల్ప-శ్రేణి, భూతలం నుంచి భూతలంపైకి ప్రయోగించగల గైడెడ్ బాలిస్టిక్ క్షిపణి ‘ప్రళయ్’ని […]
న్యూ ఢిల్లీ- రష్యా అధ్యక్షుడు వ్లాదిమీర్ పుతిన్ తో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సమావేశమయ్యారు. ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో సోమవారం సాయంత్రం ఈ భేటీ జరిగింది. మోదీ, పుతిన్ మధ్య ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలపై చర్చలు కొనసాగాయి. ఈ కీలక సమావేశంలో భారత్, రష్యాకు సంబందించిన పలు కీలక ఒప్పందాలపై వారు సంతాకలు చేశారు. అంతకు ముందు భారత్, రష్యాల మధ్య జరిగిన 2+2 సమావేశంలో నాలుగు కీలక ఒప్పందాలపై ఇరుదేశాలు సంతకాలు చేశాయి. […]