భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ(డీఆర్‌డీవో) నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. దేశవ్యాప్తంగా ఉన్న డీఆర్‌డీవో పరిశోధనా కేంద్రాల్లో 1901 సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్, టెక్నీషియన్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులు కోరుతోంది. ఈ పోస్టులకు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబర్ 3 నుంచి ప్రారంభం కానుంది. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.100 చెల్లించాల్సి ఉంటుంది. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్ సర్వీస్‌మెన్ అభ్యర్థులకు ఫీజు చెల్లించాల్సిన అవసరంలేదు. వీరికి ఫీజు నుంచి మినహాయింపు ఉంది.
మొత్తం ఖాళీలు: 1901
సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్-బి: 1075
విభాగాలు: ఆటోమొబైల్, కెమికల్, సివిల్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ & ఇన్‌స్ట్రుమెంటేషన్, ఎలక్ట్రానిక్స్/ ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్/ఎలక్ట్రానిక్స్ టెలికమ్యూనికేషన్, ఇన్‌స్ట్రుమెంటేషన్, మెకానికల్, మెటలర్జీ ఇంజినీరింగ్, అగ్రికల్చర్, బోటనీ, కెమిస్ట్రీ, లైబ్రరీ సైన్స్, మ్యాథమెటిక్స్, ఎంఎల్‌టీ, ఫొటోగ్రఫీ, ఫిజిక్స్, ప్రింటింగ్ టెక్నాలజీ, సైకాలజీ, టెక్స్‌టైల్, జువాలజీ.
టెక్నీషియన్- ఏ: 826
విభాగాలు: ఆటోమొబైల్, బుక్ బైండర్, కార్పెంటర్, సీఎన్‌సీ ఆపరేటర్, సీఓపీఏ, డ్రాఫ్ట్స్‌మ్యాన్ (మెకానికల్), డీటీపీ ఆపరేటర్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్స్, ఫిట్టర్, గ్రైండర్, మెషినిస్ట్, మెకానిక్ (డీజిల్), మిల్ రైట్ మెకానిక్, మోటార్ మెకానిక్ పెయింటర్, రిఫ్రిజరేషన్, ఫొటోగ్రాఫర్, షీట్ మెటల్ వర్కర్, టర్నర్, వెల్డర్.
అర్హతలు: పోస్టులను అనుసరించి పదో తరగతి, సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి: అభ్యర్థులు కనీస వయస్సు 18 నుంచి 28 సంవత్సరాల మధ్య ఉండాలి. రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం సడలింపు ఉంటుంది.
ఎంపిక ప్రక్రియ: రెండు దశల్లో ఎంపిక ప్రక్రియ ఉంటుంది. పోస్టును అనుసరించి టైర్-1(సీబీటీ) స్క్రీనింగ్ టెస్ట్, టైర్-2(సీబీటీ) ఎంపిక పరీక్ష, ట్రేడ్/ స్కిల్ టెస్టుల ఆధారంగా ఉంటుంది.
జీతభత్యాలు: 7వ సెంట్రల్ పే కమిషన్ (CPC) పే మ్యాట్రిక్స్ ప్రకారం.. సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్- బి పోస్టుకు ఎంపికైన వారికి రూ. 35,400 నుంచి రూ. 1,12,400 మధ్య , టెక్నీషియన్ -ఏ పోస్టుకు ఎంపికైన వారు రూ.19,900 నుండి రూ.63,200 మధ్య జీతం పొందుతారు.
దరఖాస్తు రుసుము: జనరల్, OBC మరియు EWS కేటగిరీ అభ్యర్థులు రూ. 100 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు ఎలాంటి దరఖాస్తు రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్
దరఖాస్తు ప్రారంభ తేదీ: సెప్టెంబర్ 03, 2022
దరఖాస్తుకు చివరి తేదీ: సెప్టెంబర్ 23, 2022
పూర్తివివరాలకు వెబ్‌సైట్: https://www.drdo.gov.in/
నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.