ఈ మద్య మద్యం సేవించి వాహనాలు నడుపుతో ఎన్నో ప్రమాదాలకు కారణం అవుతున్నారు మందుబాబులు. పోలీసులు ఎన్ని సార్లు హెచ్చరికలు జారీ చేసినా.. ఫైన్లు వేసినా వీరిలో ఏమాత్రం మార్పురావడం లేదు. నిత్యం ఇలాంటి సంఘటనలు ఎక్కడో అక్కడ జరుగుతూనే ఉన్నాయి.
దేశంలో ఎక్కడైనా మంచినీళ్లకు కరువు ఉండొచ్చేమో కానీ.. మందుకు ఏమాత్రం కరువు ఉండదు. ఎక్కడ చూసినా మద్యం సదా మీ సేవలో అన్నట్టు దొరుకుతుంది. రాష్ట్రాలకు అత్యధికంగా ఆదాయవనరులు చేకూర్చేదానిలో మద్యం ముఖ్యపాత్ర వహిస్తుందని అంటుంటారు. మద్యం అమ్మకాల్లో రాష్ట్రాలు పోటీలు పడుతున్నాయంటే అతిశయోక్తి లేదు. దేశంలో ఇటీవల కాలంలో ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయంటే వాటికి ప్రధాన కారణం మద్యం సేవించి డ్రైవింగ్ చేయడమే అని అధికారులు అంటున్నారు. మద్యం సేవించి వాహనాలు నడపకూడదు అని తెలిసినా.. ఎదుటి వారి ప్రాణాలే ఏమాత్రం లేక్కచేయని కొంత మంది దుర్మార్గులు మద్యం సేవించి వాహనాలు నడుపుతూ ఎన్నో ప్రమాదాలకు కారణం అవుతున్నారు. తాజాగా మద్యం సేవించిన వాహనాలు నడిపిన వారికి ఓ పోలీస్ స్టేషన్ లో వెరైటీ శిక్ష విధించారు.. దీనికి సంబంధింన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. వివరాల్లోకి వెళితే..
దేశంలో ఈ మద్య రోడ్డు ప్రమాదాలు పదుల సంఖ్యలో జరుగుతున్నాయి. ఈ ప్రమాదాల్లో ఎంతో మంది మరణించడం.. అంగవైకల్యంతో బాధపడటం చూస్తూనే ఉన్నాం. ఇంటి పెద్దను కోల్పోయిన కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. వీటన్నింటికి కారణం మద్యం సేవించి వాహనాలు నడపడమే అని అంటున్నారు అధికారు. రోడ్డు భద్రతా చర్యలు ఎంత కఠినతరం చేస్తున్నా కొంతమంది డ్రైవర్లు మద్యం సేవించి వాహనాలు నడుపుతూనే ఉన్నారు. పోలీసులు ఎంత హెచ్చరించినా వాటిని బేఖాతరు చేస్తూ వాహనాలను నడుపుతూనే ఉన్నారు. ప్రతిరోజూ మందుబాబులకు వార్నింగ్ ఇస్తూ.. ఫైన్స్ వేస్తూ ఉన్నా వారి తీరులో మార్పు రాకపోవడంతో విసిగిపోయిన కేరళా పోలీసులు ఒక వినూత్న ప్రయోగం చేశారు.
మద్యం సేవించి పట్టుబడిన వాహనదారులను స్టేషన్ కి తీసుకు వచ్చి స్కూల్ విద్యార్థుల తరహాలో వారిని కూర్చోబెట్టి ఇంపోజిషన్ రాయించారు. అసలు ఎందుకు ఇలా చేయాల్సి వచ్చిందనే విషయానికి వస్తే.. ఆదివారం కొచ్చిలో ఓ ప్రైవేట్ బస్సు ద్విచక్రవాహనాన్ని ఢీ కొట్టింది. ఈ ఘటనలో ద్విచక్ర వాహనదారుడు చనిపోయాడు. ఈ విషయంపై కేరళా హైకోర్టు సీరియస్ అయ్యింది.. నింధితులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు విసృత తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో చాలా మంది వాహనదారులు మద్యం సేవించి ఉండటం గమనించిన పోలీసులు వారికి ఈసారి ఓ వెరైటీ శిక్ష వేయాలని తలిచారు.
మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న మందుబాబులను త్రిపునితుర పోలీస్ స్టేషన్ కి తీసుకు వచ్చి వెరైటీ శిక్ష వేశారు. నోట్ బుక్ పై 1000 సార్లు ‘ఇకపై తాగి డ్రైవింగ్ చేయను’ అని మందుబాబులను స్టేషన్ లో కింద కూర్చోబెట్టి రాయించారు. పోలీసులు వేసిన వింత శిక్ష చూసి మొదట ఆశ్చర్యపోయిన మందుబాబులు చేసేదేమీ లేక వెయ్యిసార్లు ఇంపోజిషన్ రాశారు. అయితే వెయ్యిసార్లు ఇంపోజిషన్ రాసినప్పటికీ వారికి అసలు శిక్ష తప్పదని పోలీసులు తెలిపారు. మోటర్ వాహన చట్టం కింద వారిపై కేసు నమోదు చేసి లైసెన్స్ సస్పెండ్ చేయబోతున్నట్లు వెల్లడించారు. ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.