ఆశ్రమంలో ఉంటున్న మహిళ మీద అత్యాచారం కేసిన వివాదాస్పద ఆధ్మాత్మిక గురువు ఆశారాం బాపూకి శిక్ష ఖరారైంది. ఈ కేసులో ఆశారాం అత్యాచారం చేసినట్లు రుజువవ్వడంతో గాంధీనగర్‌లోని సెషన్స్ కోర్టు తీర్పు వెలువరించింది. ఆయనకు జీవిత ఖైదు విధించింది. అహ్మదాబాద్ సిటీకి శివారులోని ఆయన ఆశ్రమంలో తనపై 2001 నుంచి 2006 వరకు పలు సందర్భాల్లో లైంగిక దాడికి పాల్పడినట్లు బాధిత మహిళ 2013లో అహ్మాదాబాద్‌కు సమీపంలోని చాంద్ ఖేడ్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ కేసులో ఆశారాం బాపూకి మరో ఆరుగురు సహకరించినట్లు ఫిర్యాదులో పేర్కొంది. ఈ కేసుపై విచారణ జరిపిన ధర్మాసనం.. ఆశారం బాపూను దోషిగా తేల్చింది.
ఆశారాం బాపూ భార్యతో పాటు మరో ఐదుగురిని ఈ కేసులో నిర్దోషులుగా గాంధీనగర్ కోర్టు ప్రకటించింది. విచారణ ముగిసిన ఈ కేసులో తుది తీర్పును సోమవారం ప్రకటించింది. ఈ నేపథ్యంలో తాజాగా ఆశారాం బాపూకి జీవిత ఖైదును విధించింది. కాగా, మరో అత్యాచారం కేసులో దోషిగా తేలిన ఆశారాం బాపూకి జీవిత ఖైదు పడింది. ఈ కేసులో ప్రస్తుతం రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ జైలులో ఆయన శిక్షను అనుభవిస్తున్నారు. ఇక, ఆశారం బాపూ ఆధ్యాత్మిక గురువుగా ఎంతో పాపులర్ అయ్యారు. ఎందరో శిష్యులను ఆయన సంపాదించుకున్నారు. మన దేశంతో పాటు విదేశాల్లోనూ ఆశారాం బాపూకి శిష్యులు, ఫాలోవర్స్ ఉన్నారు. దేశ, విదేశాల్లో ఆయన పలు ఆధ్యాత్మిక కేంద్రాలు, ఆశ్రమాలను నెలకొల్పారు. ఎంతో మంది భక్తులు, ఫుల్ పాపులారిటీ, క్రేజ్ సొంతం చేసుకున్న ఆశారాం.. ఆఖరుకు ఇలా చేసిన తప్పులకు ఊచలు లెక్కబెడుతున్నారు.