దేశ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఉచిత రేషన్ పథకాన్ని మరో ఆరు నెలల పాటు పొడిగించింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం శనివారం అధికారిక ప్రకటన విడుదల చేసింది. కరోనా కష్టాల తర్వాత పీఎం గరీబ్ కల్యాణ్ అన్న యోజన పేరిట ప్రారంభమైన ఈ పథకాన్ని ఎప్పటికప్పుడు పొడిగిస్తూ వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పటి వరకు పొడిగిస్తూ వచ్చిన ఈ పథకం సమయం పూర్తయ్యింది.
ప్రధాని మోదీ కేంద్ర కేబినెట్ తో సమావేశం అయి ఉచిత రేషన్‌ను మరో ఆరు నెలల పాటు పొడిగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధాని మోదీ తీసుకున్న నిర్ణయం వల్ల పేద ప్రజలకు ఉచిత రేషన్ బియ్యం సెప్టెంబర్ వరకు కొనసాగింపబడుతుంది. కాగా, ఈ పథకం కింత దేశ వ్యాప్తంగా ఎనభై కోట్ల మందికి లబ్ధి చేకురుతుంది. దేశంలో కరోనా వ్యాప్తి మొదలైనపుడు ఈ పథకాన్ని ప్రారంభించింది. అర్హులైన ప్రజలకు ఉచిత రేషన్ పంపిణీ చేస్తోంది.
ఈ పథకాన్ని పలమార్లు గడువు పెంచుతూ వచ్చింది.ఇదిలా ఉంటే.. ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా యోగా రెండోసారి ఎన్నికైన విషయం తెలిసిందే. ఆయన బాధ్యతలు చేపట్టిన వెంటనే ఉచిత రేషన్‌ను మూడు నెలలు పొడిగిస్తూ శనివారం నాటి తన తొలి కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.