సినిమా హీరోలకు ఆయా థియేటర్ల ముందు భారీగా కటౌట్లు పెట్టి పాలాభిషేకాలు, పూలతో అలకరించి అభిమానులు సందడి చేసేవారు. అక్కడి నుండి మెల్లిగా ఈ కల్చర్ ఫంక్షన్లకు పాకింది. గతంలో పెళ్లిళ్లకు, పేరంటాళ్లకు ఫ్లెక్సీలు వేయించారు. ఆ తర్వాత ఏదైనా సాధించిన, దేశానికి సేవ చేసిన వ్యక్తులు ఫోటోలతో కటౌట్లు, బ్యానర్లు, ఫ్లెక్సీలు పెట్టేవారు.
సినిమా విడుదల రోజు హీరోలకు ఆయా థియేటర్ల ముందు భారీగా కటౌట్లు పెట్టి పాలాభిషేకాలు చేసి, పూలతో అలకరించి అభిమానులు సందడి చేసేవారు. అక్కడి నుండి మెల్లిగా ఈ కల్చర్ ఫంక్షన్లకు పాకింది. గతంలో పెళ్లిళ్లకు, పేరంటాళ్లకు ఫ్లెక్సీలు వేయించారు. ఆ తర్వాత ఏదైనా సాధించిన, దేశానికి సేవ చేసిన వ్యక్తులు ఫోటోలతో కటౌట్లు, బ్యానర్లు, ఫ్లెక్సీలు పెట్టేవారు. కానీ నేడు ట్రెండ్ పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు నేతల దగ్గర నుండి ప్రతి వ్యక్తికి బ్యానర్లు కడుతున్నారు. పుట్టిన రోజు, సంతాపాలకు ఫ్లెక్సీలు వెలుస్తున్నాయి. కానీ ఓ వ్యక్తికి తన స్నేహితులు అదిరిపోయే కటౌట్ కట్టించారు. ఇంతకు ఏ సందర్భంలో అనుకుంటున్నారా.. శోభనానికి..
వినడానికి వింతగా ఉన్న ఈ ఘటన జరిగింది కర్ణాటకలోని మంగళూరు నగరంలో. మంగళూరు మెట్రోపాలిటన్ కార్పొరేషన్ పరిధిలోని కద్రి పోలీస్ స్టేషన్ కాంపౌండ్ వాల్‍కు భారీ బ్యానర్ కట్టి ఉంది. వెడ్డింగ్ నైట్ సెలబ్రేషన్స్ అంటూ ఆ ఫ్లెక్సీలో రాసి ఉంది. ప్రస్తుతం ఈ ఫోటో వైరల్ అవుతుంది. ‘రాత్రంతా పోరాడి గెలిపొందాలి మిత్రుడా’అంటూ ఫ్రెండ్ ఫోటోతో కటౌట్ పెట్టించారు. అందులో తొలి రాత్రి వివరాలు కూడా పొందు పరిచారు. జూన్ 12న రాత్రి 12 గంటలకు అంటూ పేర్కొనడం గమనార్హం. వరుడి పేరు సుదర్శన్ అని తెలుస్తుంది. అతడి అభిమాన బలగం అంటూ కొన్ని దేశాల పేర్లు రాశారు. కాగా, ఇది చూసిన పౌరులు అవాక్కయ్యారు. ఇలాంటి పిచ్చి చేష్టలకు పాల్పడ్డ వారిపై చర్యలు తీసుకోవాలని సూచించారు.