రైతులు.. వారికి జరిగిన అన్యాయానికి వివిధ తీరుల్లో నిరసన ద్వారా ప్రభుత్వాలకు తెలియజేస్తుంటారు. తాజాగా ఓ వ్యక్తి ఏకంగా నోట్ల కట్టలను రోడ్లపై చల్లి తన తన నిరసన తెలిపాడు.
దేశానికి వెన్నెముక రైతన్న అని ఎందరో తమ ఉపన్యాసలో చెప్తుంటారు. అయితే వాస్తవ పరిస్థితుల్లో మాత్రం రైతన్నను చాలా మంది చిన్న చూపు చూస్తుంటారు. అంతేకాక వారిని ఆదుకోవాల్సిన అధికారులు అడ్డదారులు తొక్కి.. రైతులకు అన్యాయం చేస్తుంటారు. తమకు న్యాయం చేయమని రైతులు ఎన్ని సార్లు అధికారులు చుట్టు తిరిగిన వారు పట్టించుకోరు. చివరకు విసుగు చెందిన రైతులు.. వారికి జరిగిన అన్యాయానికి వివిధ తీరుల్లో నిరసన ద్వారా ప్రభుత్వాలకు తెలియజేస్తుంటారు. తాజాగా ఓ వ్యక్తి ఏకంగా నోట్ల కట్టలను రోడ్లపై చల్లి తన తన నిరసన తెలిపాడు. మరి.. ఎందుకు అతడు అలా చేశాడో.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం…
మహారాష్ట్రలోని ఓ ప్రాంతంలో వ్యవసాయ అధికారులు నకిలీ విత్తనాలు సరఫరా చేస్తున్న వారిని పాలు పోసి పెంచుతున్నారని స్థానిక రైతులు ఆరోపిస్తున్నారు. ఎన్నోసార్లు నకిలీ విత్తనాలు సరఫరా చేసే వారి గురించి అధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదంట. వ్యాపారులు ఇచ్చే డబ్బులకు కక్కుర్తి పడి.. తమకు అన్యాయం చేస్తున్నారని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అలానే ఓ రైతు కూడా ఎన్నో సార్లు అధికారులకు ఫిర్యాదు చేసిన వారి నుంచి ఎటువంటి స్పందన లేదు.
దీంతో చివరకు విసుగు చెంది.. వినూత్నంగా నిరసన తెలియజేశాడు. బొచ్చలో 10, 20, 50,100,200, 500 నోట్లను పొలంకి మందు చల్లినట్లు రోడ్లపై చల్లాడు. అంతేకాక లంచగొండి అధికారులారా మారండి అంటూ కేకలు వేశాడు. వ్యవసాయ శాఖ మంత్రి అబ్దుల్ సత్తర్, కొందరు వ్యవసాయ శాఖ అధికారులందరూ కుమక్కై రైతులను నాశనం చేస్తున్నారని ఈ తీరులో నిరసన తెలియజేశారు. నకిలీ విత్తనాలు తయారు చేసే పరిశ్రమలకు లంచాలు తీసుకుని అడ్డగోలుగా పర్మిషన్లు ఇస్తూ, రైతన్నకు జీవితం లేకుండా చేస్తున్నారని ప్రపంచానికి తెలిసేలా స్థానిక రైతులు నిరసనలు తెలిపారు.
హింగోలి వ్యవసాయ కార్యాలయం ముందు పైసల కట్టలను విసురుతూ రైతన్నకు న్యాయం చేయలంటూ నిరసన చేశారు. ఇక జీవితాలను నడిపే నోట్ల కట్టలను ఇలా రోడ్లపై పడేశారంటే.. ఆ రైతులకు ఎంత ఆవేదన కలిగి ఉంటుందో అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కంచె సేను మేస్తే.. అన్నతీరున.. రైతులను కాపాడిల్సిన అధికారులే ఇలా మోసలకు పాల్పడుతుంటే ఇక రైతులు ఏమైపోవాలి అంటూ మరికొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి.. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.