ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు.. ఎన్నో వింత వార్తలు – సంఘటనలు మన కళ్లెదుట కనిపిస్తుంటాయి. అలాంటి షాకింగ్ సంఘటన ఒకటి కర్ణాటక రాష్ట్రంలో చోటుచేసుకుంది. సామాన్యంగా మనం బలమైన కారణాలతో జనాలు పోలీసులను ఆశ్రయించడం చూస్తుంటాం. అది ఆర్థిక లావాదేవీల విషయంలో కావచ్చు. లేదా ఇల్లు – వ్యాపారం – భూములకు సంబంధించిన కేసులు నమోదవడం మాములే. కానీ ఇటీవల పలు సిల్లీ కారణాలతో జనాలు పోలీసులను ఆశ్రయించడం ఆశ్చర్యం కలిగిస్తుంది.
కర్ణాటక రాష్ట్రంలోని శివమొగ్గ జిల్లా, భద్రావతి తాలూకాకు చెందిన హళెహోన్నూరు పోలీస్‌స్టేషన్ పరిధిలో వింత కేసు వైరల్ అయింది. తాను పెంచి పోషిస్తున్న ఆవులకు తగినంత దాణా పెట్టి మేపుతున్నాను. కానీ నాలుగు రోజుల నుండి అవి పాలు ఇవ్వడం లేదని.. పాలు పితకడానికి ప్రయత్నిస్తే ఎగిరి తంతున్నాయి. ఎలాగైనా మీరే న ఆవులను సరైన దారిలో పెట్టాలని ఓ రైతు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
రైతు ఫిర్యాదు విని ఖంగుతిన్న పోలీసులు.. ఇలాంటి కేసులు తీసుకోమని, నీ ఆవులను నువ్వే దారిలో పెట్టుకోవాలని రైతుకు సర్దిచెప్పి పంపించారు. ప్రస్తుతం ఈ సంఘటన సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వెరైటీ ఫిర్యాదు పై మీరు ఓ లుక్కేసి, మీ అభిప్రాయాలను కామెంట్స్ చేయగలరు.