ఈ మద్య భూమిపైనే కాదు.. ఆకాశ మార్గంలో కూడా ప్రమాదాలు జరుగుతున్నాయి. ఎయిర్ పోర్ట్ నుంచి టేకాఫ్ అయిన విమానాలు, హెలికాప్టర్లు టెక్నికల్ ఇబ్బందులు తలెత్తడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి.. కొన్ని సమయాల్లో పైలెట్లు ప్రమాదాలు గమనించి సురక్షితంగా ల్యాండ్ చేస్తు ప్రయాణీకులు ప్రాణాలు కాపాడుతున్నారు.
ఇటీవల దేశంలో పలు విమాన ప్రమాదాలు సంభవిస్తున్న విషయం తెలిసిందే. టేకాఫ్ అయిన కొద్ది సమయంలోనే టెక్నికల్ ఇబ్బందులు తలెత్తడం.. ఇతర కారణాల వల్ల ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి. కొన్ని సమయాల్లో పైలెట్లు ప్రమాదాన్ని గమనించి ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయడం చూస్తూనే ఉన్నాం. తాజాగా బీజేపీ నేత, మాజీ సీఎం యడియూరప్ప ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కి ప్రమాదం జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళితే..
బీజేపీ నేత, కర్ణాటక మాజీ సీఎం యడియూరప్పకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. సోమవారం ఆయన హెలికాప్టర్ లో కలిబుర్గికి బయలుదేరారు. జెవారీలో హెలికాప్టర్ ల్యాండింగ్ చేసే సమయంలో టెక్నికల్ ఇబ్బంది తలెత్తింది. పైలట్ ఎంతో చాకర్యంగా వ్యవహరించి హెలికాప్టర్ని ల్యాండ్ చేయకుండా తిరిగి పైకి లేపి వెనక్కి మళ్లించాడు. కొద్ది సేపు ఆకాశంలోనే చక్కర్లు కొట్టారు. హెలికాప్టర్ ల్యాండింగ్ కోసం ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ చుట్టూ ప్లాస్టీక్ షీట్లు.. ఇతర వ్యర్థాలు ఉండటంతో ఒక్కసారిగా దుమ్ము పైకి లేచింది. అదే సమయంలో సుడిగాలి సైతం వచ్చినట్లు తెలుస్తుంది.. దాంతో హెలికాప్టర్ ల్యాండ్ చేయడానికి పైలెట్ కి ఇబ్బంది తలెత్తింది.
ఏం జరుగుతుందో అని అధికారులు, పోలీసులు మొదట కంగారు పడ్డా వెంటనే హెలిప్యాడ్ అంతా క్లీయర్ చేయడంతో పైలెట్ హెలికాప్టర్ ని సురక్షితంగా ల్యాండ్ చేశారు. దీంతో పెద్ద ప్రమాదం తప్పిందని అధికారులు, కార్యకర్తలు అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటన కారణంగా యడియూరప్ప పర్యటన అర్థాంతరంగా వాయిదా పడింది. దీంతో ఆయనకు స్వాగతం పలికేందుకు వచ్చిన అభిమానులు, కార్యకర్తలు వెనుతిరిగిపోయారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
#WATCH | Kalaburagi | A helicopter, carrying former Karnataka CM and senior leader BS Yediyurappa, faced difficulty in landing after the helipad ground filled with plastic sheets and waste around. pic.twitter.com/BJTAMT1lpr
— ANI (@ANI) March 6, 2023