ఉద్యోగాలకు వెళతుంటే ఏం తీసుకెళతామ్.. ఫైల్స్, లాప్ టాప్, క్యారేజ్. కానీ ఈ ఉద్యోగులు ఇవేమీ కాకుండా బైక్ హెల్మెట్ తీసుకెళుతున్నారట. ఏవైనా మర్చిపోతారు కానీ దీన్నితీసుకెళ్లడం మర్చిపోరు. వాటిని పెట్టుకుని విధులు నిర్వర్తిస్తారు.
ఉద్యోగంలో పరాకుగా ఉన్నా తప్పే. ఎప్పుడు ఏ తప్పు జరుగుతుందో అని ఒళ్లు దగ్గర పెట్టుకుని పనిచేయాల్సిందే. ఎటు నుండి బాస్ వచ్చి ఏ ప్రశ్న అడిగితే చెప్పాలన్న భయంతో పనిచేస్తుంటారు. చిన్న తప్పు చేశామా బాస్ నుండి చీవాట్లు తప్పవు. ఒక్కోసారి ఆ చిన్న తప్పులే పెద్దవిగా మారి ఉద్యోగాలు ఊడిపోయే పరిస్థితి వస్తాయి. అయితే ఇప్పుడు మనం చెప్పుకునే ఉద్యోగులు ఒళ్లు దగ్గర పెట్టుకుని పనిచేయడం లేదు. హెల్మెట్లు తలకు పెట్టుకుని పని చేస్తున్నారు. ఇంతకూ ఇది వింత అయినప్పటికీ.. వారికి తప్పడం లేదు. ఇంతకూ ఆ ఉద్యోగులు ఎక్కడున్నారంటే ఉత్తరప్రదేశ్ లోని బాగ్ పట్ జిల్లాలో.
యూపీలోని బరౌత్ పట్టణంలోని యూపీ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (యూపీపీసిఎల్) భవనం ఉద్యోగులు.. పొద్దునే ఆ కార్యాలయానికి వెళ్లేటప్పుడు క్యారేజ్‌తో పాటు హెల్మెట్లు తీసుకు వెళుతున్నారు. అవి ఆఫీసుల్లో ధరించి విధులు నిర్వర్తిస్తారు. అయితే అది చూసిన బయట జనం నిరసన అని సరిపెట్టుకుంటున్నారు. అదీ ఒకటి రెండు రోజులు, మహా అయితే వారం రోజులు ఉంటుంది. కానీ హెల్మెట్లు ధరించడం ఆ ఉద్యోగస్థులకు షరా మూమూలుగా సాగింది. ఉద్యోగులను కలిసేందుకు వస్తున్న వారు కూడా హెల్మెట్ ధరించి రావడంతో చర్చనీయాంశమైంది. ఆ ఉద్యోగులను కదిపితే అసలు విషయం వెల్లడైంది. ఈ భవానాన్ని ఎప్పుడో బ్రిటీష్ కాలంలో నిర్మించారు. అందులోనే యూపీ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు.
ఈ బిల్డింగ్‌లో ఇంజినీర్లు, క్లర్కులు, కాంట్రాక్టు ఉద్యోగులు.. అందరూ కలిపి సుమారు 40 మంది వరకూ పనిచేస్తున్నారు. ఇప్పుడు పూర్తిగా పాడైపోయి శిథిలావస్థకు చేరింది. ముఖ్యంగా మీటర్ టెస్టింగ్ ల్యాబ్ పరిస్థితి అయితే, మరీ దారుణంగా ఉందని ఉద్యోగులు చెబుతున్నారు. ఏ క్షణాన భవనంపై కప్పు పెచ్చులు ఊడి తల మీద పడతాయో అనే భయంతో ఉద్యోగులందరూ ఇలా హెల్మెట్లు ధరించి విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ పెచ్చులూడి మీద పడిన ఘటనలు బోలెడు ఉన్నాయని వీరు చెబుతున్నారు. భవనంలో అనుక్షణం భయంభయంగా గడుపుతున్నామన్నారు. వర్షాకాలంలో అయితే మరింత ఆందోళనగా చెందుతున్నట్లు వాపోతున్నారు. కొంత మందికి తీవ్రమైన గాయాలు కూడా అయ్యాయని, పై అధికారులకు చెప్పినా పట్టించుకోకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఇలా హెల్మెట్లు పెట్టుకునే పనిచేస్తున్నట్లు చెబుతున్నారు. ఈ వార్త స్థానికంగా వైరల్ గా మారింది.
Over 40 employees of the state power dept are forced to wear helmets while working at the metre-testing lab inside the British-era building of UP Power Corporation Ltd (UPCL) in Baghpat’s Baraut town. https://t.co/1d0K7B5y6u pic.twitter.com/tRFKKz28YM
— TOIWestUP (@TOIWestUP) February 27, 2023