Ek Nath Shinde: మహారాష్ట్ర సంక్షోభంలో ఓ కొత్త ట్విస్ట్ చోటుచేసుకుంది. గత కొద్ది రోజులుగా ఉత్కంఠగా సాగుతున్న రాజకీయ పోరులో ఏక్‌నాథ్ షిండే ఘన విజయం సాధించారు. మహారాష్ట్ర సీఎంగా బాధ్యతలు చేపట్టారు. గురువారం రాత్రి 7.30 గంటలకు షిండే ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ రాజ్‌భవన్‌లో ప్రమాణ స్వీకారం చేయించారు. ఇక, బీజేపీ నేత దేవేంద్ర పడ్నవీస్ ఉపముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అంతకు క్రితం పడ్నవీస్ మాట్లాడుతూ.. తాను ప్రభుత్వంలో ఉండనని పడ్నవీస్ స్పష్టం చేశారు.
అయినప్పటికి ప్రభుత్వం సాఫీగా సాగేలా చూసుకుంటానని చెప్పారు. ఏమైందో ఏమో కానీ, మళ్లీ ప్రభుత్వంలో కీలక పదవిని చేపట్టారు. ఇక, మహారాష్ట్ర మంత్రి, శివసేన అగ్రనేత ఏక్‌నాథ్ షిండే తన అనుచర ఎమ్మెల్యేలతో కలిసి క్యాంప్ రాజకీయాలకు తెరలేపిన సంగతి తెలిసిందే. రెబెల్ ఎమ్మెల్యేలతో మహా వికాస్ అఘాడి ప్రభుత్వాన్ని సంక్షోభంలో పడేశారు. పలు నాటకీయ పరిణామాల మధ్య ఏక్‌నాథ్ షిండే సీఎంగా అవతరించారు. కాగా, నిన్న మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే తన పదవికి రాజీనామా చేశారు.
గవర్నర్ ప్రకటన ప్రకారమే మహారాష్ట్ర అసెంబ్లీలో శుక్రవారం బలపరీక్ష నిర్వహించాలన్న సుప్రీం కోర్టు తీర్పు వెలువరించిన కాసేపటికే సీఎం ఉద్దవ్ థాక్రే ఈ నిర్ణయం తీసుకున్నారు. బలపరీక్షకు ముందే ఉద్ధవ్ రాజీనామా చేయడం గమనార్హం. ఈ మేరకు బుధవారం రాత్రి 9.40 గంటలకు ఫేస్‌బుక్ లైవ్ ద్వారా రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన ఆయన సీఎం పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. మరి, ఏక్‌నాథ్ షిండే మహారాష్ట్ర సీఎంగా బాధ్యతలు చేపట్టడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : బ్రేకింగ్ : దేశ వ్యాప్తంగా నిలిచినపోయిన SBI సేవలు..!