ప్రయాణాల్లో ఏదో ఒకటి మర్చిపోవడం కామన్. ఆటోలు, బస్సులు, రైళ్లు, విమానాల్లో ప్రయాణించే సమయంలో చాలా మంది ఫోన్లు, పర్సులు, బ్యాగులు లాంటివి మర్చిపోతుంటారు. అయితే కొన్ని సందర్భాల్లో మర్చిపోయిన వస్తువులు మళ్లీ దొరకడం కష్టమే. ఇంకొన్ని సార్లు సహప్రయాణికులు వాటిని గుర్తుచేసి ఇస్తుంటారు. పలు సందర్భాల్లో మర్చిపోయిన వస్తువులను డ్రైవర్లు తిరిగి ఇచ్చిన సందర్బాలు ఉన్నాయి. అలాంటి ఓ ఘటనే ఉత్తర్ ప్రదేశ్‌లో చోటుచేసుకుంది. మోదీ నగర్‌కు చెందిన ఓ రిక్షావాలా రూ.25 లక్షల నగదుతో తనకు దొరిగిన బ్యాగును పోలీసులకు అందించి నిజాయితీ చాటుకున్నాడు. మహ్మద్ అనే ఈ-రిక్షా డ్రైవర్ తన ఆటోలో ప్రయాణికులతో వెళ్తుండగా.. టిబ్రారోడ్డు సమీపంలోని చెరువుకట్టపై పడి ఉన్న ఒక బ్యాగును చూశాడు.
బ్యాగులో ఏముందోనని మహ్మద్ ఓపెన్ చేసి చూడగా.. డబ్బులు కనిపించడంతో ఒకింత ఆశ్చర్యానికి గురయ్యాడు. ఆ తర్వాత ఫ్రెండ్‌కు సమాచారం ఇచ్చాడు. అనంతరం వాళ్లిద్దరూ కలసి ఆ బ్యాగును మోదీ నగర్ పోలీసు స్టేషన్‌లో అప్పగించారు. పోలీసులు ఆ బ్యాగును తెరిచి చూశారు. అందులో రూ.25 లక్షల విలువైన 500 నోట్ల కట్టలు కనిపించాయి. బ్యాగ్‌లో ఇంత పెద్దమొత్తంలో క్యాష్ కనిపించినా దాన్ని తీసుకోకుండా, పోలీసులకు అందించిన మహ్మద్ నిజాయితీని అందరూ మెచ్చుకుంటున్నారు. అతడ్ని ఘజియాబాద్ రూరల్ డీసీపీ రవికుమార్ ప్రశంసా పత్రంతో సత్కరించారు. ఈ బ్యాగును మొదట తెరిచినప్పుడు బాంబ్ ఉందేమోనని తనకు అనుమానం వచ్చిందని.. కానీ దాంట్లో డబ్బు కనిపించిందని డ్రైవర్ మహ్మద్ అన్నాడు. వెంటనే బ్యాగ్ యజమాని కోసం వెతికానని.. ఎవరూ కనిపించకపోవడంతో పోలీసులకు సమాచారం ఇచ్చానన్నాడు. మరి.. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
#PoliceCommissionerateGhaziabad
सड़क किनारे मिले पैसो से भरे बैग को पुलिस को सौप कर ईमानदारी की मिसाल पेश करने वाले ई रिक्शा चालक को डीसीपी ग्रामीण द्वारा किया गया सम्मानित pic.twitter.com/uyOQVcn6cB— DCP RURAL COMMISSIONERATE GHAZIABAD (@DCPRuralGZB) February 7, 2023