పీకలదాకా మద్యం తాగిన ఓ వ్యక్తి మత్తులో నాగుపామును పట్టుుకుని ముద్దాడాడు. ఆ తరువాత దాన్ని మెడలో వేసుకుని విన్యాసాలు చేశాడు. ఇలా పాములను పట్టుకుని చేసే అతిపనులు చివరకు విషాదాన్ని మిగుల్చుతాయి.
పామును చూస్తే చాలా మంది భయంతో వణికిపోయి.. పరుగులు తీస్తుంటారు. కొందరు మాత్రం పాములను చూసి భయపడరు. అలానే వాటిని పట్టుకుని సురక్షిత ప్రాంతాల్లో వదిలేస్తూ ఉంటారు. కొందరు జనాలు ఎక్కువ ఉన్న సమయంలో కాస్త అత్యుత్సాహం ప్రదర్శిస్తుంటారు. తామే ధైర్యవంతులమని అందరు అనుకోవాలని పాములతో విన్యాసాలు చేస్తుంటారు. మరి కొందరు మద్యం మత్తులు పామును పట్టుకుని తెగముద్దులు పెడుతుంటారు. అయితే ఇలా చేసే అతిపనులు కొన్ని సార్లు ప్రాణాలకే ముప్పు తెస్తాయి. తాజాగా ఓ వ్యక్తి పీకల దాకా తాగి మద్యం మత్తులో నాగుపాముతో ఆటలు ఆడాడు. చివరకు అదే పాము కాటుకు బలయ్యాడు. ఈ ఘటన బీహార్ లో చోటుచేసుకుంది పూర్తి వివరాల్లోకి వెళ్తే..
బీహార్ రాష్ట్రం నవాదా జిల్లాలోని గోవింద్ పుర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దిలీప్ యాదవ్ అనే వ్యక్తి కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నాడు. అతడు స్థానికంగా కూలి పనులు చేసుకుంటూ డబ్బులను అర్జీంచే వాడు. అలానే దిలీప్ కు మద్యం తాగే అలవాటు ఉంది. తరచూ మద్యం తాగి ఊర్లో తిరుగుతు తెగ హంగామా చేస్తుంటాడు. ఈ క్రమంలో ఇటీవలే పూటుగా మద్యం తాగి ఓ నాగు పామును పట్టుకున్నాడు. అంతటితో ఆగక దానిని మెడలో వేసుకుని శివుడు మాదిరిగా ఫోజులు ఇచ్చాడు. ఆ తరువాత పామును ముద్దు పెట్టుకున్నాడు. కాసేపట్టి తరువాత మరల సర్పాన్ని మెడలో వేసుకుని ఆలయం వద్దకు వచ్చాడు. అక్కడ దేవుడు ముందు శిరస్సు వంచి దండాలు పెట్టి.. తనను క్షమించమని కోరాడు.
ఆ తరువాత పామును మెడలోనే ఉంచుకుని కాసేపు చిందులేశాడు. ఈ క్రమంలో నాగు పాము దిలీప్ యాదవ్ ను కాటువేసింది. వెంటనే అతడు తన చేతిలోని పామును వదిలేసి కిందపడిపోయాడు. దిలీప్ యాదవ్ ను స్థానికులు గమనించి.. కుటుంబ సభ్యులకు తెలిపారు. వారు వెంటనే వచ్చి దిలీప్ ను ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే అతడు చనిపోయినట్లు వైద్యులు నిర్థారించారు. దిలీప్ మృతితో అతడి కుటుంబంలో విషాదం అలుముకుంది. మద్యం మత్తులో చేసే కొన్ని పనులు ప్రాణాలనే బలి తీసుకుంటాయి. అందుకు ఉదాహరణ దిలీప్ ఘటన. మరి.. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.