గత రెండేళ్ల కాలంలో దేశంలో కరోనా మహమ్మారి సృష్టించిన అల్లకల్లోలం అందరికి తెలిసిందే. చాలా మంది జీవితాలను చిన్నాభిన్నం చేసింది. అయితే కొద్ది కాలం నుంచి దేశంలో కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. దీంతో కేంద్ర ప్రభుత్వం కోవిడ్ ఆంక్షలను ఎత్తివేసింది. ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ శ్రీనివాసరావు ఈ విషయాన్ని వెల్లడించారు.
డీహెచ్ శ్రీనివాసరావు మాట్లాడతూ..”గత రెండేళ్లుగా కరోనాతో ఎంతో ఇబ్బందిపడ్డాం. మాస్క్‌లు ధరించడాన్ని కొంత అసౌకర్యంగా భావించాం. అందువల్ల మాస్క్ పెట్టుకోవాలా.. వద్దా.. అనేది ఇప్పుడు ఛాయిస్ మాత్రమే. వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు మాస్క్‌లు ధరించాలి, ముఖ్యంగా ఆసుపత్రులకు వెళ్లినప్పుడు తప్పనిసరి. జనసమూహంలో ఉన్నప్పుడు మాస్క్ తప్పనిసరిగా ధరించాలి” అని స్పష్టం చేశారు. గురువారం ఇక్కడ ఆయన విలేకరులతో మాట్లాడుతూ మాస్క్ ధరించకపోతే వెయ్యి రూపాయల జరిమానా కొనసాగుతుందని, అయితే ఈ విషయం లో పోలీసులు చూసీచూడనట్లు వ్యవహరించాలని అన్నారు. కరోనా పూర్తి నియంత్రణలోకి వచ్చిందని, చైనా, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో మాత్రం ఇంకా కరోనా కేసులు నమోదవుతున్నా, ఆ వేరియంట్లు ఇప్పటికే మనదేశంలో వచ్చిపోయాయని అన్నా రు.అయితే కరోనా విషయంలో మహారాష్ట్ర ప్రభుత్వం కూడా ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఆంక్షల్ని పూర్తిగా ఎత్తేస్తున్నట్లు ప్రకటించింది. ఇకపై మాస్క్‌లు ధరించడం తప్పనిసరి ఏం కాదని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ మేరకు ఏప్రిల్ 1, శుక్రవారం నుంచి సడలింపు ఇస్తున్నట్లు ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. మాస్క్ ధరిచకపోతే.. జరిమాన విధించబోమని తెలిపింది. రాష్ట్రంలో కరోనా నియంత్రణలో ఉందని, కాబట్టి ఆంక్షల సడలింపులో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు మహరాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.వాస్తవానికి శనివారం నుంచి ఇది అమలులోకి రావాల్సి ఉంది. అయితే.. ఒకరోజు ముందస్తుగానే ఈ ఆదేశాలను విడుదల చేసింది ప్రభుత్వం. మరి.. ఈ విషయాలపై మీ అభిప్రాయాలను కామెంట్స రూపంలో తెలియజేయండి.
Maharashtra Government issues order withdrawing all COVID19 restrictions. pic.twitter.com/wTaKCPUa7G
— ANI (@ANI) April 1, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.