తెలంగాణలోని ఇబ్రహీంపట్నంలో నియంత్రణ ఆపరేషన్ వికటించి చనిపోయిన మృతుల కుటుంబాలకు 5 లక్షల ఎక్స్ గ్రేషియా ఇస్తున్నట్లు డీహెచ్ శ్రీనివాసరావు ప్రకటించారు. ఈ ఆపరేషన్ వికటించి నలుగురు మహిళలు మృతి చెందడం చాలా బాధాకరమని ఆయన అన్నారు. ఇక డీహెచ్ మాట్లాడుతూ.. కుటుంబ నియంత్రణ ఆపరేషన్లను జాతీయ స్థాయిలో నిర్వహించే క్యాంప్ లో భాగంగా జరిపామని తెలిపారు. ఈ ఆపరేషన్లలో డబుల్ పoక్చర్ లాప్రోస్కాపి, ట్యుబెక్టమి, వేసెక్టమి నిర్వహించినట్లు ఆయన పేర్కొన్నారు. ఇబ్రహీం పట్నంలోని సీహెచ్ సీలో 34 మందికి సినీయర్ డాక్టర్ల్ సర్జరీ చేశారని ఆయన వివరించారు.
అయితే దురదృష్టవశాత్తు నలుగురు మహిళలు మరణించారని డీహెచ్ తెలిపారు. చనిపోయిన మహిళల కుటుంబాలకు 5లక్షల ఎక్స్ గ్రేషియా, డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ప్రకటించారు. శస్త్రచికిత్స జరిగిన 30మందిని మళ్ళీ స్క్రీనింగ్ చేశామన్నారు. ప్రత్యేక ఆరోగ్య బృందాలను పేషెంట్ల ఇళ్లకు పంపినట్లు వెల్లడించారు. వారిలో కొందరిని మెరుగైన చికిత్స నిమిత్తం ఒక ఆస్పత్రి లో ఉంచినట్లు పేర్కన్నారు. మరికొందరిని నిమ్స్ లో కూడా చేరిచ్చినట్లు శ్రీనివాస రావు తెలిపారు.