తెలంగాణలోని ఇబ్రహీంపట్నంలో నియంత్రణ ఆపరేషన్ వికటించి చనిపోయిన మృతుల కుటుంబాలకు 5 లక్షల ఎక్స్ గ్రేషియా ఇస్తున్నట్లు డీహెచ్ శ్రీనివాసరావు ప్రకటించారు. ఈ ఆపరేషన్ వికటించి నలుగురు మహిళలు మృతి చెందడం చాలా బాధాకరమని ఆయన అన్నారు. ఇక డీహెచ్ మాట్లాడుతూ.. కుటుంబ నియంత్రణ ఆపరేషన్లను జాతీయ స్థాయిలో నిర్వహించే క్యాంప్ లో భాగంగా జరిపామని తెలిపారు. ఈ ఆపరేషన్లలో డబుల్ పoక్చర్ లాప్రోస్కాపి, ట్యుబెక్టమి, వేసెక్టమి నిర్వహించినట్లు ఆయన పేర్కొన్నారు. ఇబ్రహీం పట్నంలోని సీహెచ్ సీలో […]