మహారాష్ట్రలో ఓ ప్రభుత్వ బడి ఉంది. ఆ బడి ప్రత్యేకత ఏంటనుకున్నారు. అందులో చదివేది ఒక్కడే స్టూడెంట్. దానిలో వింతేముంది అనుకుంటున్నారా. మామూలుగా ఒక్కడే విద్యార్థి ఉంటే.. ఏం చేస్తారూ బడినే మూసేస్తారు. కానీ ఆ ఒక్క విద్యార్థి కోసం మహారాష్ట్ర ప్రభుత్వం బడిని నడుపుతోంది. ఓ మాస్టారు బడికి వచ్చి పాఠాలు కూడా నేర్పిస్తున్నారు. అదీ పది కిలోమీటర్లు ప్రయాణించి మరీ. ఒక్కటీ కాదూ సుమా అన్నీసబ్జెక్టులను ఆయనే బోధిస్తున్నారు. ప్రస్తుతం ఈ వార్త హాట్ […]
గత రెండేళ్ల కాలంలో దేశంలో కరోనా మహమ్మారి సృష్టించిన అల్లకల్లోలం అందరికి తెలిసిందే. చాలా మంది జీవితాలను చిన్నాభిన్నం చేసింది. అయితే కొద్ది కాలం నుంచి దేశంలో కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. దీంతో కేంద్ర ప్రభుత్వం కోవిడ్ ఆంక్షలను ఎత్తివేసింది. ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ శ్రీనివాసరావు ఈ విషయాన్ని వెల్లడించారు. డీహెచ్ శ్రీనివాసరావు మాట్లాడతూ..”గత రెండేళ్లుగా కరోనాతో ఎంతో ఇబ్బందిపడ్డాం. మాస్క్‌లు ధరించడాన్ని కొంత అసౌకర్యంగా భావించాం. అందువల్ల మాస్క్ పెట్టుకోవాలా.. వద్దా.. అనేది […]
ఐపీఎల్ 2022 సీజన్ మరికొన్ని రోజుల్లో మొదలు కానుండగా.. భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ)కి గట్టి షాక్ తగిలింది. మ్యాచ్‌ల నిర్వహణ అనుమతులపై మహారాష్ట్ర ప్రభుత్వం యూటర్న్ తీసుకునే అవకాశం ఉన్నట్లు వార్తలొస్తున్నాయి. కరోనా వైరస్ తగ్గుముఖం పట్టడంతో 25 శాతం ప్రేక్షకులతో ఐపీఎల్ మ్యాచ్‌లు నిర్వహించుకోవచ్చని మహరాష్ట్రలోని శివసేన ప్రభుత్వం ముందుగా అనుమతిచ్చింది. కానీ తాజా సమాచారం ప్రకారం ఈ అనుమతిని రద్దు చేయాలని ప్రభుత్వ పెద్దలు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా కేసులు […]
ఒమైక్రాన్ కేసులు పెరుగుతుండడం.. పండుగల నేపథ్యంలో కొవిడ్ వ్యాప్తిపై కేంద్ర ప్రభుత్వం సైతం హెచ్చరికలు చేయడంతో రాష్ట్రాలు అందుకు తగినట్లుగా సిద్ధమవుతున్నాయి. ఒక్కొక్కటిగా ఆంక్షలను విధిస్తున్నాయి. దేశంలో ఒమిక్రాన్ ఎఫెక్ట్ ఎక్కువగా మహారాష్ట్ర తో పాటు దేశ రాజధానిపైనే పడింది. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం కఠిన ఆంక్షలను విధించాలని నిర్ణయం తీసుకుంది. ఈమేరకు రాష్ట్రంలో మరోసారి నైట్ కర్ఫ్యూ విధించింది. రాత్రి తొమ్మిది గంటల నుంచి ఉదయం ఆరు గంటల వరకు కర్ఫ్యూ అమలు చేయనున్నారు. […]