తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్.. నిత్యం ఏదో వివాదాలతో వార్తల్లో నిలుస్తుంటారు. గతంలో కరోనాకు సంబంధించి ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం కాగా.. మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఆ వివరాలు..
తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావ్‌కు వివాదాలు కొత్త కాదు. ఆయన చర్యలు, వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారుతూ ఉంటాయి. ఇక తాజాగా మరోసారి కొత్త వివాదాన్ని రాజేశారు శ్రీనివాస్ రావు. ప్రజలకు మూఢనమ్మకాల గురించి జాగ్రత్తలు చెప్పి.. హెచ్చరించాల్సింది పోయి.. స్వయంగా ఆయనే వాటిని ప్రోత్సాహిస్తూ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. హెల్త్ డైరెక్టర్ వంటి కీలక స్థాయిలో ఉన్న వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే.. ఇక సామాన్య ప్రజలకు ఏమని చెబుతాం.. అంటూ ప్రశ్నిస్తున్నారు. అయినా ఇలా నిత్యం ఏదో ఒక వివాదంలో ఉండకపోతే మీకు నిద్ర రాదా అని ప్రశ్నిస్తున్నారు జనాలు. ఇంతకు ఆయన ఏం మాట్లాడారు.. ఎందుకు విమర్శలు వస్తున్నాయి. అంటే..
తెలంగాణ హైల్త్ డైరెక్టర్ శ్రీనివాస్.. తాజాగా ఓ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆనాడు కట్టిన తాయత్తు మహిమ వల్లే ఈ రోజు తాను ఈ స్థాయిలో ఉన్నానని చెప్పుకొచ్చారు. ఈ వ్యాఖ్యలపై నెట్టింట పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. కొత్తగూడెంలోని కేసీ ఓఏ క్లబ్‌లో డాక్టర్ జీఎస్ఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సోమవారం ముస్లింలకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన శ్రీనివాస్.. ముస్లింలతో కలిసి నమాజ్ చేశారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘‘నేను పుట్టిన సమయంలో తీవ్రమైన అనారోగ్యానికి గురయ్యాను. చావు బతుకుల మధ్య ఉన్నాను. ఆ పరిస్థితుల్లో డాక్టర్లు కూడా చేతులెత్తేశారు. అప్పుడు కొత్తగూడెం పట్టణంలోని బడే మజీద్ దగ్గర ఇంట్లో వాళ్లు నాకు తాయత్తు కట్టించారు. దాని మహిమతోనే నేను ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నాను” అని ఆయన తెలిపారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలపై నెట్టింట పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది.
అనంతరం శ్రీనివాస్ మాట్లాడుతూ.. కొత్తగూడెంలో కొత్తగా ఈద్గాలు, కబరస్థాన్లు ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కేసీఆర్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా దాదాపు నాలుగున్నర లక్షల మందికి రంజాన్ తోఫాలు పంపిణీ చేశారని చెప్పుకొచ్చారు. రంజాన్ నెలలో మసీదులకు డబ్బులు ఇస్తున్నారని, అయితే అవి సరిపోవడం లేదని, ఇంకా పెంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. మరి శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.