ఈ మద్య చాలా మంది చిన్న చిన్న విషయాలకే ఎమోషన్ కి గురికావడం.. ఆ సమయంలో ఏం చేస్తున్నామో అన్న విచక్షణ మరిచి ఎదుటివారిపై దాడులు చేయడం చూస్తూనే ఉన్నాం. సామాన్యులే కాదు ఉన్నతస్థాయిలో ఉన్నవారు సైతం పలు సందర్భాల్లో పబ్లిక్ గా కొట్టుకోవడం చూస్తూనే ఉన్నాం. ఈ మద్య కోర్టులోనే న్యాయవాదులు ఒకరిపై ఒకరు దాడి చేసిన ఘటన మరువక ముందే.. లైవ్ మీటింగ్ లో డాక్టర్లు చెప్పులతో కొట్టుకున్నారు. ఈ ఘటన మద్యప్రదేశ్ లో జరిగింది. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
మధ్యప్రదేశ్ జబల్ పూర్ లో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కి సంబంధించి ఒక వార్షిక సమావేశం జరుగుతుంది. ఈ సమావేశానికి ప్రముఖ వైద్యులు విచ్చేశారు. సమావేశానికి విచ్చేసిన డాక్లర్లను ఉద్దేశించి ఓ వక్త మాట్లాడుతున్న సమయంలో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తి సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తున్న వక్త వద్దకు వెళ్లి గొడవ పెట్టుకున్నాడు. వారిద్దరి మద్య మాటా మాటా పెరిగిపోయింది. అంతలోనే మరికొంత మంది డాక్లర్లు పోడియం వద్దకు వెళ్లి గొడవ పడ్డారు. ఇలా డాక్టర్లు ఒకరిపై ఒకరు చెప్పులు తీసుకొని మరీ దాడి చేసుకున్నారు. ఈ గొడవ కాస్త ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారిపోయింది.
ఈ ఘటనపై కొత్తగా ఎన్నిక అయిన జబల్ పూర్ ఐఎంఏ ప్రెసిడెంట్ డాక్టర్ అభిజిత్ బిష్ణోయి మాట్లాడుతూ.. ‘ఈ ఘటన సిగ్గుతో తలదించుకునేలా చేసింది.. సమావేశం ఉద్దేశంచి వక్త ప్రసంగిస్తున్న సందర్భంగా గ్వాలియర్ కి చెందిన ఓ డాక్టర్ అనవసరంగా ఆయనతో గొడవ పెట్టుకోవడం.. అంతలోనే మరికొంత మంది అక్కడికి వచ్చి ఆ విషయాన్ని పెద్దదిగా చేసి వాగ్వాదానికి దిగి కొట్టుకోవడం జరిగింది. ఇలాంటి ఘటన మరోసారి పునరావృతం జరగకుండా చూస్తాం.. అలాగే దీనిపై విచారణ కమిటీ వేస్తాం’ అని అన్నారు.
मध्यप्रदेश: जबलपुर इंडियन मेडिकल एसोसिएशन डॉक्टरों की बैठक में जमकर हुई आपस में मारपीट, वीडियो वायरल …#Madhyapradesh #Jabalpur #IMA #ViralVideos pic.twitter.com/9w2ULWKHsK
— humsamvet (@humsamvet) October 31, 2022