జీవితంలో అన్నిటికంటే అపురూపమైన వేడుకగా పెళ్లి గురించి పెద్దలు చెబుతుంటారు. ఈ వేడుకను గ్రాండ్‌గా జరుపుకోవాలని అందరూ భావిస్తారు. రాజస్థాన్‌లో ఓ జంట కూడా అలాగే అనుకున్నారు. పెళ్లికి అన్నీ ఏర్పాట్లు పూర్తయ్యాయి. కాసేపట్లో వివాహం అనగా ఊహించని ఘటన జరిగింది.
పెళ్లి జీవితంలో అన్నిటికంటే పెద్ద వేడుక. సెలబ్రిటీల నుంచి సామాన్యుల దాకా, ధనికుల నుంచి పేదవారి దాకా ప్రతి ఒక్కరూ ఈ సెలబ్రేషన్స్‌ను గ్రాండ్‌గా జరుపుకునేందుకు ప్లాన్ చేసుకుంటారు. హల్దీ, మెహిందీ, సంగీత్ లాంటి వాటిని భారీగా ప్లాన్ చేసుకుంటారు. పువ్వులతో అలంకరించిన అందమైన కల్యాణ మండపంలో బంధువులు, మిత్రులు, సన్నిహితులతో పాటు అతిథులు చూస్తుండగా వేదమంత్రాల సాక్షిగా ఒక్కటవుతారు. పెళ్లికి అంత పెద్ద తంతు ఉంది. అయితే కొన్ని పెళ్లిళ్లలో అనుకోని అవాంతరాలు ఏర్పడతాయి. ఎంతో వైభవంగా జరగాల్సిన వివాహ ప్రక్రియను హడావుడిగా ముగించాల్సి వస్తుంది. అలాంటి ఘటనే రాజస్థాన్‌లో చోటుచేసుకుంది.
రాజస్థాన్ కోటా జిల్లాలోని ఎస్బీఎస్ ఆస్పత్రి ఓ వినూత్న వివాహానికి వేదికగా మారింది. కోటా జిల్లాలోని రామ్‌గంజ్ మండి ప్రాంతంలోని భావ్పురాకు చెందిన పంకజ్ అనే యువకుడికి రావత్‌భటాలో ఉండే మధు రాఠోడ్‌తో శనివారం పెళ్లి జరగాల్సి ఉంది. ఇద్దరి ఇళ్లలో వివాహ కార్యక్రమాలు జరుగుతున్నాయి. వధువు కల్యాణ మండపానికి వెళ్లేందుకు సిద్ధమవుతుండగా ఊహించని ఘటన చోటుచేసుకుంది. మండపానికి బయలుదేరిన పెళ్లికూతురు మెట్లపై నుంచి జారిపడింది. ఈ ఘటనలో ఆమె రెండు చేతులు విరిగాయి. తలకు కూడా తీవ్ర గాయాలయ్యాయి. దీంతో వెంటనే ఆమెను సమీపంలోని ఎస్బీఎస్ ఆస్పత్రిలో చేర్చారు.
పెళ్లికూతురు జారిపడిన విషయం చెప్పేలోపే పెళ్లికొడుకు కుటుంబం కల్యాణ మండపానికి బయలుదేరింది. దీంతో పంకజ్ తండ్రి శివలాల్, మధు తండ్రి రమేశ్ రాఠోడ్ ఇద్దరూ ఈ విషయం గురించి మాట్లాడుకున్నారు. ఆస్పత్రిలోనే వివాహ వేడుక నిర్వహించాలని వాళ్లిద్దరూ నిర్ణయించారు. మ్యారేజ్ కోసం ఆస్పత్రిలోనే ఓ గదిని బుక్ చేశారు. దాన్ని అందంగా అలంకరించారు. పెళ్లి తంతు అంతా అక్కడే నిర్వహించారు. ఆఖరుకు వధూవరులు మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. దీంతో ఇరువురి కుటుంబ సభ్యులు సంతోషంలో మునిగిపోయారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Marriage in Kota Hospital : कोटा में अनूठा मामला, अस्पताल में भर्ती दुल्हन से शादी रचाने बारात लेकर पहुंचा दूल्हाhttps://t.co/lyQ9lxT8NA@RajCMO @ashokgehlot51
— ETVBharat Rajasthan (@ETVBharatRJ) February 12, 2023