CM : ఒరిస్సా రాష్ట్రంలో గురువారం స్థానిక మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికలు జరిగాయి. ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. గురువారం ఉదయం 9.10 గంటలకు ఓ సాదాసీదా ఓటరుగా కాలినడకన 53వ వార్డులోని ఏరో డ్రామ్ ఉన్నత పాఠశాలకు చేరుకున్నారు. 544వ నంబర్ పోలింగ్ బూత్‌లో బీఎంసీ మేయర్, కార్పొరేటర్‌లకు ఓటు వేశారు. నవీన్ నివాసం నుంచి 300 మీటర్ల దూరంలో ఈ పోలింగ్ కేంద్రం ఉంది. దీంతో ఆయన సాధారణ రక్షణ దళం సహాయంతో ఓటు వేయటానికి వెళ్లారు.
ఓ సీఎం ఇలా కాలినడక తక్కువ సెక్యూరిటీతో ఓటు వేయటానికి వెళ్లటంపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. కాగా, నిన్న జరిగిన మున్సిపల్ ఎన్నికలు పలు చోట్ల తీవ్ర ఘర్షణలకు దారి తీశాయి. పట్నగఢ్లో ఎమ్మెల్యే సోదరుడిపై కొందరు వ్యక్తులు దాడి చేశారు. బోలంగీర్ బీజేడీ, కాంగ్రెస్ శ్రేణుల మధ్య తోపులాట చోటుచేసుకుంది. పిప్పిలిలో జరిగిన దాడిలో ఓ బీజేపీ ఏజెంట్ గాయపడ్డాడు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : బైకుపై స్కూల్ కు వస్తానంటే కుదరదు .. ఇకపై నో ఎంట్రీ!
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.